Ganja Gang Arrest: పుష్ప రేంజ్‌కి ఏ మాత్రం తగ్గట్లేదుగా.. వీళ్ల సెటప్ చూస్తే బాబోయ్ అనాల్సిందే

|

Sep 04, 2023 | 1:47 PM

ఓ ఖాళీ లారీ ఇలా కిలోమీటర్లు కిలోమీటర్లు చుట్టేస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా దూసుకుపోతోంది. ఆ లారీకి ముందు ఎస్కార్ట్ లో కారు.. ముందు దారిలో పోలీస్‌ చెకింగ్ ఉందా..? లేదా..? అన్నది కారులో ఉన్న వాళ్లు ‌ చెక్ చేస్తు వెళ్తుంటారు. ఏదైనా ఉంటే ముందే హెచ్చరించడం ఇది వారి ప్లాన్. కానీ బెడిసి కొట్టింది.

Ganja Gang Arrest: పుష్ప రేంజ్‌కి ఏ మాత్రం తగ్గట్లేదుగా.. వీళ్ల సెటప్ చూస్తే బాబోయ్ అనాల్సిందే
Ganja Seized Gang Arrested
Follow us on

ఇటీవలే వచ్చిన పుష్ప సినిమా ఓ సంచలనం.. రియాల్టీని మించిన స్థాయిలో సినిమా.. ఎర్రదొంగల కథను కటింకి కట్టినట్లుగా అచ్చుగుద్దినట్లుగా తెరమీద చూపించారు. అయితే ఇప్పుడు అదే తరహాలో స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు స్మగ్లర్లు. ఎంత తెలివిగా స్మగ్లింగ్ చేసినప్పటికీ పోలీసుల చేతికి చిక్కిపోతున్నారు. అలా పుష్ప తరహాలోనే.. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులను బురిడీ కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్టు చేసి 208 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఇదంతా పెద్ద గేమ్ ప్లాన్.. అయితే వారు వేసిన వ్యూహం అడ్డంగా దొరికిపోయింది. ఏపీ టు మహారాష్ట్ర.. వయా తెలంగాణ సాగిన గంజాయి స్మగ్లింగ్‌కు బ్రేకులు వేశారు స్పెషల్ పోలీసులు. ఈ ముఠాను నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పట్టుకుంది. హైవేపై కాకుండా గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుని చిన్న చిన్న దారుల్లో ప్రయాణిస్తూ చేరవేయాల్సిన చోటికి పక్కా చేరుకోవలి. కానీ, కథ అడ్డం తిరిగింది.

వేరే దారిలో ప్రయాణం చేస్తూ విజయనగరం మీదుగా గుంటూరు, మాచర్ల.. ఇక్కడి నుంచి తెలంగాణలోకి రావాలి.. తెలంగాణలోని దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల మీదుగా మహారాష్ట్రలోకి ఎంట్రీ ఇవ్వాలి. గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠాను బయట పెట్టారు నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సిబ్బంది.

ఓ ఖాళీ లారీ ఇలా కిలోమీటర్లు కిలోమీటర్లు చుట్టేస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా దూసుకుపోతోంది. ఆ లారీకి ముందు ఎస్కార్ట్ లో కారు.. ముందు దారిలో పోలీస్‌ చెకింగ్ ఉందా..? లేదా..? అన్నది కారులో ఉన్న వాళ్లు ‌ చెక్ చేస్తు వెళ్తుంటారు. ఏదైనా ఉంటే ముందే హెచ్చరించడం ఇది వారి ప్లాన్. కానీ బెడిసి కొట్టింది.

అడ్డంగా దొరికిన ఈ గాంజాయి పుష్పా గ్యాంగును పోలీసులు  ఈజీగా పట్టుకున్నారు. ఈ వివరాలను ఎస్పీ సునీతా రెడ్డి మీడియా తెలిపారు. నిందితుల దగ్గరి నుంచి కోటి రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సునీతా రెడ్డి వెల్లడించారు. కారులో ఉన్న ముగ్గురు, లారీలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్టైన వారిని కస్టడీలోకి తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

ట్వీట్ ఇక్కడ చూడండి..


విజయనగరం నుంచి మహారాష్ట్రకు లారీలో గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 208 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టీఎస్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (టీఎస్‌ఎన్‌ఏడీ) అధికారులు , పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పథకం ప్రకారం నిందితులను పట్టుకున్నారు. ఈ మేరకు టీఎస్‌ ఎన్‌వైఏబీ ఎస్పీ సునీతారెడ్డి వివరాలు వెల్లడించారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం