AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kavitha Arrest: ఆ యాక్ట్ ప్రకారమే కవిత అరెస్ట్..! ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్.. ఇవాళ ఏం జరగనుందంటే..

Delhi liquor Policy Case: కవిత అరెస్ట్ తర్వాత ఇవాళ ఏం జరగబోతుంది? విచారిస్తారా? కోర్టులో ప్రవేశపెడతారా? కవితపై అప్లై చేసిన సెక్షన్లు ఏంటి? ఆర్థిక నేరాల కేసులు పెడితే బెయిల్ రావడం అంతా ఈజీ కాదా? అసలు ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.. PMLA యాక్ట్-19ను అనుసరించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీ తరలించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ED ఆఫీస్‌కు కవిత అర్ధరాత్రి 12.20 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

Kavitha Arrest: ఆ యాక్ట్ ప్రకారమే కవిత అరెస్ట్..! ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్.. ఇవాళ ఏం జరగనుందంటే..
MLC Kavitha
Shaik Madar Saheb
|

Updated on: Mar 16, 2024 | 11:17 AM

Share

Delhi liquor Policy Case: కవిత అరెస్ట్ తర్వాత ఇవాళ ఏం జరగబోతుంది? విచారిస్తారా? కోర్టులో ప్రవేశపెడతారా? కవితపై అప్లై చేసిన సెక్షన్లు ఏంటి? ఆర్థిక నేరాల కేసులు పెడితే బెయిల్ రావడం అంతా ఈజీ కాదా? అసలు ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.. PMLA యాక్ట్-19ను అనుసరించి మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీ తరలించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ED ఆఫీస్‌కు కవిత అర్ధరాత్రి 12.20 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రంత్రా ఈడీ అఫీసులో ఉన్నారు కవిత. ఇవాళ ఉదయం కవితకు వైద్య పరీక్షలు చేస్తారు. మధ్యాహ్నం వరకు విచారించి తర్వాత రౌస్‌అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తారు ఈడీ అధికారులు. అయితే.. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన అమిత్ అరోరాను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యంగా అమిత్ అరోరా ఇచ్చిన సమాచారంతోనే కవితను అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. గత నాలుగు రోజుల నుంచి అమిత్ అరోరాను విచారిస్తుండగా.. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్ని ఈడీకి ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. ఢిల్లీ లిక్కర్స్ స్కాం కేసులో సౌత్ లాబీ కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. దీంతో.. ఇవాళ ఉదయం అమిత్ అరోరాతో కలిపి మరోసారి కవితను విచారించనున్నారు. మధ్యాహ్నం తర్వాత కవితను కోర్టులో హాజరుపరచనున్నారు. తర్వాత కస్టడీకి కోరనున్నారు ఈడీ అధికారులు. కవితను ఢిల్లీ ఈడీ కార్యాలయానికి తరలించడంతో ఈడీ ఆఫీసు దగ్గర 144 సెక్షన్‌ విధించారు. కవితతో పాటు ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆమె భర్త, ఆమె తరపు లాయర్.. అక్కడే పడిగాపులు కాసారు. కవిత అరెస్ట్‌తో ఢిల్లీ ఈడీ ఆఫీస్‌ దగ్గర భారీగా పోలీసు బలగాల మోహరించారు.

అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్‌ వేయనున్నారు. అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్‌ వేస్తారు. ఈడీ కోర్టులో రిమాండ్‌ను చాలెంజ్ చేయనున్నారు కవిత. చట్ట విరుద్దంగా ఈడీ వ్యవహరించిందని కోర్టుకు తెలుపుతామన్నారు. న్యాయవ్యాదులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదే మాదిరి కోర్టులపై తమకు నమ్మకం ఉంది. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారని తెలిపారు కవిత లాయర్. ఇటువంటి కేసుల్లో, మానీలాండరింగ్ కేసులో బెయిల్ అంత ఈజీగా రాదని.. మాజీ జేడీ, వివి. లక్ష్మినారాయణ.

అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలక పాత్ర పోషించారని.. పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుతో సంబంధమున్న పలువురిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా.. కవితకు సంబంధించి విషయాలను బయటపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే.. కవిత పీఏతో పాటు పలువురు కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయి.. సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. వాళ్లు ఇచ్చిన ఆధారంగానే.. ఛార్జ్ షీట్లు నమోదు చేయగా.. అందులో కవిత పేరును అధికారులు చేర్చారు. అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇవాళ కవిత విషయంలో ఎలాంటి పరిణామాలు జరగుతాయోనన్న ఆసక్తి నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు