Valentine Day Gift: వాలెంటైన్స్ డే పేరుతో మీ వాట్సప్‌కు ఆ లింక్ వచ్చిందా?.. ఓపెన్ చేశారో అంతే సంగతులు..!

|

Feb 03, 2021 | 5:10 AM

Valentine Day Gift: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు తెలివి మీరుతున్నారు. ప్రజల వీక్‌నెస్, ఆశలను, ఆసక్తులను అవకాశంగా మలుచుకుంటూ నయా మోసానికి..

Valentine Day Gift: వాలెంటైన్స్ డే పేరుతో మీ వాట్సప్‌కు ఆ లింక్ వచ్చిందా?.. ఓపెన్ చేశారో అంతే సంగతులు..!
Follow us on

Valentine Day Gift: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు తెలివి మీరుతున్నారు. ప్రజల వీక్‌నెస్, ఆశలను, ఆసక్తులను అవకాశంగా మలుచుకుంటూ నయా మోసానికి పాల్పడుతున్నారు. తమ వలకు చిక్కిన వారిని నిలువునా దోచుకుంటున్నారు. తాజాగా మొబైల్ వాట్సప్‌లో, సోషల్ మీడియాలో ‘టాటా’ కంపెనీ పేరుతో ఓ లింక్ తెగ వైరల్ అవుతోంది. ‘సులువైన ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. ప్రేమికుల రోజు సందర్భంగా విలువైన బహుమతులు గెలుచుకోండి’ అంటూ ప్రముఖ వ్యాపార దిగ్గజం ‘టాటా’ సంస్థ పేరుతో అందరి మొబైల్ వాట్సప్‌కు లింక్ షేర్ అవుతోంది. అంతేకాదు.. టాటా ప్రమోషన్‌ను ఐదు వాట్సప్ గ్రూపులు లేదా 20 మంది స్నేహితులకు పంపించాలంటూ సూచిస్తోంది. అయితే ఈ లింక్ గురించి సమాచారం అందుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. అసలు కథ ఏంటా అని ఆరా తీశారు. అదంతా ఫేక్ అని గుర్తించారు.

ప్రజలను అలర్ట్ చేశారు. ఇదంతా సైబర్ నేరగాళ్ల మాయ అని, ప్రజలు ఇలాంటి లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ‘ఆ లింక్ ఓపెన్ చేయగానే.. సులువైన ప్రశ్నలకు సమాధానం చెబితే ఎంఐ 11టి ఫోన్ గెలుచుకోవచ్చు అంటూ కనిపిస్తుంది. అలా ప్రశ్నల పర్వం అయిపోయాక మీరు ఫోన్ గెలుచుకున్నారంటూ ఫోన్‌కు సందేశం వస్తుంది. అయితే ఫోన్ పొందాలంటే యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తోంది. అలా యాప్ డౌన్‌లోడ్ చేసుకోగానే మన ఫోన్‌లోని డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళుతుంది. బ్యాంకు లావాదేవీలు, వ్యక్తిగత సమాచారం అంతా నేరగాళ్ల చేతిలోకి వెళ్తుంది’ అని పోలీసులు వివరించారు. దయచేసి ప్రజలు ఇలాంటి లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత లింక్‌లు, వ్యక్తుల నుంచే వచ్చే సందేశాల జోలికి వెళ్లకుండా వాటిని బ్లాక్ చేయడం ఉత్తమం అని సూచిస్తున్నారు.

Also read:

హాంకాంగ్ బిఎన్ (ఓ) పాస్‌పోర్ట్‌లను తిరస్కరించడంతో చిక్కుల్లో పడ్డ భారత, పాకిస్తానీ, నేపాలీలు

OBC Creamy Layer: కీలక ఆలోచన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఆ పరిమితిని పెంచుతారా?.. ఓబీసీలకు మేలు జరిగేనా?..