TS Corona Virus: దేశ వ్యాప్తంగా థర్డ్ వేవ్ లో కరోన వైరస్(Corona Virus) వేగంగా వ్యాపిస్తోంది. ప్రంట్ లైన్ వారియర్స్ భారీగా కోవిడ్ (Covid 19) బారిన పడుతున్నారు. ఓ వైపు వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడుతుండగా.. ఇప్పుడు పోలీసులు కూడా కోరనా బాధితులుగా మారుతున్నారు. తాజాగా తెలంగాణ పోలీస్ శాఖను కరోనా వైరస్ మహమ్మారి కలవరపెడుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశలో వివిధ పోలీస్‌స్టేషన్స్‌లో సిబ్బంది కరోనా బారిన పడినట్లు పోలీసు వర్గాలు చెప్పాయి. థర్డ్‌వేవ్‌లో సుమారు 500 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు పోలీస్ స్టేషన్ లో కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
కరోనా సమయంలో పోలీస్ సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించిన ప్రభుత్వం.. వారికి వ్యాక్సిన్ లో ప్రాధాన్యత కల్పించింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి పోలీసుశాఖలో 90 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. అయితే ఇప్పుడు ప్రంట్ లైన్ వారియర్స్ కు బూస్టర్ డోస్‌ను సైతం వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హోమ్ గార్డ్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు బూస్టర్ డోస్ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
మొదటి దశలో 2,000 మందికి పోలీసులకు కోవిడ్ బారిన పడగా 50 మంది మరణించారు. రెండో దశలో 700 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం మరోసారి కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్న పోలీస్ అధికారులు..పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
మరోవైపు తెలంగాణలోనూ కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పలు ఆంక్షలు అమలు చేయడానికి రెడీ అవుతుంది. కఠిన ఆంక్షల దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈక్రమంలో పోలీసులు పటిష్ట భద్రత చేపట్టనున్నారు.
Also Read: