Jeevan Reddy: కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి.. బరిలోకి దింపే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్ ఎంపీగా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయన పేరును పరిశీలిస్తోందట. గతంలో కరీంనగర్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి గట్టి పోటీ ఇచ్చారు జీవన్ రెడ్డి. తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి జీవన్ రెడ్డిని రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉందని తెలుస్తోంది.

Jeevan Reddy: కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి.. బరిలోకి దింపే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం
Jeevan Reddy

Updated on: Dec 15, 2023 | 4:42 PM

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్ ఎంపీగా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయన పేరును పరిశీలిస్తోందట. గతంలో కరీంనగర్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి గట్టి పోటీ ఇచ్చారు జీవన్ రెడ్డి. తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ, ఇప్పుడు మరోసారి జీవన్ రెడ్డిని రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా జీవన్ రెడ్డిని పోటీ చేయించాలని కోరుతున్నారు. దీంతో.. మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

కరీంనగర్ ఎంపీ స్థానంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. తరువాత వరుసగా 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువలేక పోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగుర వేసేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే, బలమైన నేత కోసం అన్వేషణ మొదలు పెట్టింది హస్తం పార్టీ.

గతంలో జీవన్ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో.. కేసిఆర్ పై పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి, కేవలం 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జీవన్ రెడ్డికి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే, ఓడిపోయినప్పటికీ, ఎక్కడ తగ్గలేదు.. పలు అంశాలపై మాట్లాడుతున్నారు. రైతు భరోసా, రుణ మాఫీ తదితర అంశాల గురించి గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఓటపై గురించి ఆలోచించకుండా జనంలో ఉంటున్నారు.

ఇక కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి మరోసారి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బీజేపీ తరుఫున పోటీ చేయనున్నారు. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, ఈ ఇద్దరు అభ్యర్థులు ఎన్నికల పనిని కూడా ప్రారంభించారు. అయితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ మూడవ స్థానానికి పరితమైంది. ఈసారి.. ఇక్కడ గెలిచేందుకు ప్లాన్ చేస్తోంది. ఇదిలావుంటే ఇప్పటివరకు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎంపీగా వి జయం సాధించలేదు.. ఈ నియోజకవర్గంలో రెడ్డిల ఓట్లు కూడా అధికంగానే ఉంటాయి. ఈసారి సీనియర్ నేతగా ఈ అంశం జీవన్ రెడ్డికి కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

ఇక జీవన్ రెడ్డి బరిలోకి దిగుతే, కరీంనగర్‌లో త్రిముఖ పోరుగా ఉండే అవకాశాలు ఉన్నాయి.. బండి సంజయ్, ఇప్పటికే ఎన్నికల రంగంలోకి దిగారు. డిసెంబర్ నెలలో 20 వేల మంది కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళం నిర్వహించేందుకు ఫ్లాన్ చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచీ పోటీ చేసి ఓడిపోయారు. రెండవ సారి గెలించేందుకు దూకుడు పెంచుతున్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఈసారి గెలవాలని పట్టుదలతో ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. అయితే.. కాంగ్రెస్ మాత్రం, తాజా రాజకీయ పరిణమాలను గమనిస్తుంది. మొత్తానికి.. మూడు పార్టీలు.. కరీంనగర్‌లో జెండా ఎగురవేసేందుకు ఎత్తులు.. పై ఎత్తులు వేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…