
సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లిలో ఒక విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. రోజంతా కష్టపడి అలసిపోయిన ఒక స్థానిక వ్యక్తి, సాయంత్రం కాస్త రిలాక్స్ అవుదామని స్థానిక వైన్ షాపులో ఒక ప్రముఖ బ్రాండ్‌కు చెందిన బీరు బాటిల్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి ఎంతో ఇష్టంగా తాగుదామని సీల్ తీసి, బీరును గ్లాసులో పోస్తుండగా అతనికి ఊహించని షాక్ తగిలింది. ఆ బాటిల్ లోపల ఒక ఖాళీ కండోమ్ ప్యాకెట్ స్పష్టంగా తేలుతూ కనిపించింది. అది చూసి సదరు వ్యక్తి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు.
బాటిల్ లోపల అది స్పష్టంగా తేలుతూ కనిపించడంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని వైన్ షాప్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లగా, స్థానికంగా ఇది పెద్ద చర్చకు దారి తీసింది..దీంతో మద్యం ప్రియులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన పై మద్యం ప్రియులు,స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త కాస్తా చుట్టుపక్కల ప్రాంతాల్లో తెగ వైరల్ అయింది. బ్రాండెడ్ కంపెనీలు కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బీరు బాటిళ్లను ఎలా ప్యాక్ చేస్తున్నాయంటూ మద్యం ప్రియులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని అందిస్తున్న మద్యం తయారీ విషయంలో ఇంతటి నిర్లక్ష్యమా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ప్రాణాలకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల బాటిలింగ్ యూనిట్లలో తక్షణమే కఠిన తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘోర నిర్లక్ష్యంపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో, సదరు కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
వీడియో ఇక్కడ చూడండి..
\
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…