YS Sharmila: షర్మిల బెయిల్‌పై పూర్తైన వాదనాలు.. తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

సోమవారం వైఎస్ షర్మిలను పోలీసులు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం షర్మిల సిట్ ఆఫీస్ కు వెళ్లబోతుందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఆమెను అడ్డుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే షర్మిల వాళ్లతో ప్రతిఘటించడం.. ఓ మహిళా పోలీసు చెంపపై కొట్టడం, అలాగ్ ఓ ఎస్సైపై దురుసుగా ప్రవర్తించడం తీవ్ర దుమారం రేపింది.

YS Sharmila: షర్మిల బెయిల్‌పై పూర్తైన వాదనాలు.. తీర్పు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
Ys Sharmila
Follow us
Aravind B

|

Updated on: Apr 25, 2023 | 1:02 PM

సోమవారం వైఎస్ షర్మిలను పోలీసులు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం షర్మిల సిట్ ఆఫీస్ కు వెళ్లబోతుందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఆమెను అడ్డుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే షర్మిల వాళ్లతో ప్రతిఘటించడం.. ఓ మహిళా పోలీసు చెంపపై కొట్టడం, అలాగ్ ఓ ఎస్సైపై దురుసుగా ప్రవర్తించడం తీవ్ర దుమారం రేపింది. అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. అయితే తాజాగా ఈరోజు బెయిల్ పిటీషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. అయితే ఈ వ్యవహారంపై తీర్పుని నాంపల్లి కోర్టు మధ్యాహ్ననికి వాయిదా వేసింది.

షర్మిలను అక్రమంగా అరెస్టు చేశారని.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని షర్మిల తరపున న్యాయవాది వాదించారు. మరోవైపు షర్మిల పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని.. ఆమెకు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వాలను ప్రశ్నిస్తే జైల్లో పెడుతారా అంటూ వైఎస్ విజయలక్మీ సోమవారం పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న షర్మిలను పరామర్శించిన విజయలక్ష్మి.. కార్యకర్తలంతా సంయమనంతో ఉండాలని కొరారు. నిరుద్యోగుల కోసం పోరాడుతున్న షర్మిలను అరెస్టు చేయడం సరికాదన్నారు.