పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్ కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆయన సైలంట్ గా లోక్ సభలో గెలుపు వ్యూహాలపై కసరత్తులు చేస్తుండగానే, రాష్ట్రంలో ఖాళీగా నామినేట్ పోస్టులపై ద్రుష్టి సారించారు. గతంలో సీట్లు ఆశించి భంగపడ్డ నేతలు, ఎన్నికల్లో ప్రచారంలో భాగమైన వారికి నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఒక్కరోజే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నామినేట్ చేసింది.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా రేవంత్ రెడ్డి సన్నిహితుడు పటేల్ రమేష్ రెడ్డి నియమితులయ్యారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ గా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కె.శివసేనారెడ్డి నియమితులయ్యారు. తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో టీపీసీసీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ కు కూడా రేవంత్ కు అవకాశం కల్పించారు. కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ గా ఐఎన్ టీయూసీ నేత జనక్ ప్రసాద్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఎన్ గిరిధర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మైనారిటీ నేత ఎంఏ ఫహీం తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ గా నామినేట్ అయ్యారు.
నామినేట్ జాబితా ఇదే
పటేల్ రమేష్ రెడ్డి
నేరెళ్ల శారద
నూతి శ్రీకాంత్ గౌడ్
రాయల నాగేశ్వరరావు
బండ్రు శోభారాణి
ఎన్. ప్రీతమ్
శివసేనారెడ్డి
ఈరవత్రి అనిల్
జగదీశ్వరరావు (కొల్లాపూర్)
మెట్టు సాయికుమార్
గుర్నాథ్ రెడ్డి (కొడంగల్)
జ్ఞానేశ్వర్ ముదిరాజ్
బెల్లయ్య నాయక్
ప్రకాష్ రెడ్డి (భూపాలపల్లి)
జంగా రాఘవరెడ్డి
ఇనుగాల వెంకట్రామి రెడ్డి
రియాజ్
కాల్వ సుజాత
కాసుల బాలరాజు (బాన్సువాడ)
నిర్మలా గౌడ్ (జగ్గారెడ్డి సతీమణి)
అయితే నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన జాబితాలో మిగతావారి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఈ తాజా నిర్ణయం పార్లమెంట్ ఎన్నికల ముందు అటు సీఎం రేవంత్ కు, కాంగ్రెస్ పార్టీకి మైలేజీ ఇవ్వనుంది.