AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: ఒట్టేసి చెబుతున్నా.. ఆ రెండు విషయాలు జరిగే తీరుతాయి: సీఎం రేవంత్ రెడ్డి

ఒట్టేసి మరీ చెబుతున్నా.. మూసీ ప్రక్షాళన అస్సలూ ఆగదని నల్గొండ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2034 వరకు ఎగిరేది కాంగ్రెస్ జెండాయేనని ఆయన అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించడంతో పాటు బీఆర్ఎస్‌ పదేళ్ల పాలనపై విమర్శలు సంధించారు.

CM Revanth Reddy: ఒట్టేసి చెబుతున్నా.. ఆ రెండు విషయాలు జరిగే తీరుతాయి: సీఎం రేవంత్ రెడ్డి
Cm Revanth Reddy's Nalgonda Speech
Anand T
|

Updated on: Jun 28, 2026 | 9:44 PM

Share

తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తి తెలంగాణకు అవసరం లేదని.. వారు మళ్లీ వస్తే ఏమవుతుందో ప్రజలకు తెలుసన్నారు. వేలకోట్లు దోచుకున్న వారు తెలంగాణకు అవసరమా అని.. 2034 వరకు తెలంగాణలో 3 రంగుల జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే BRS నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండున్నరేళ్ల తమ పాలనపై చర్చకు సిద్ధమా అన్నారు. స్పీకర్‌కు లేఖ రాస్తే అడిగినన్ని రోజులు చర్చపెడతామని.. మేనిఫెస్టోలపై ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధమన్నారు. రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తోంది నిజం కాదా, కేసీఆర్‌ తినే సన్నబియ్యమే మా పేదలు తింటున్నారని ఆయన్నారు. అనుమానం ఉంటే తండాలకు వెళ్లి చూసుకోవచ్చుని చెప్పుకొచ్చారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే కడుపు మంట ఎందుకని మండిపడ్డారు.

రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నామని.. 30 నెలల్లో రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేశామన్నారు. కేంద్రం చుట్టూ తిరిగి యూరియా కష్టాలు లేకుండా చేశామని.. 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందని.. కాళేశ్వరం నీళ్లులేకుండా రికార్డుస్థాయి పంట ఉత్పత్తి సాధిస్తున్నామన్నారు. గురుకులాల నుంచి వందలాది అంబేద్కర్‌లను తయారుచేస్తామని.. గిరిజనులకు మెరుగైన విద్య అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒట్టేసి చెబుతున్నా..ఆ రెండు విషయాలు కచ్చితంగా జరిగే తీరుతాయి-సీఎం
ఒట్టేసి చెబుతున్నా..ఆ రెండు విషయాలు కచ్చితంగా జరిగే తీరుతాయి-సీఎం
చంద్ర సంచారం.. ఎవరికి లాభం? ఎవరికి నష్టమో తెలుసా?
చంద్ర సంచారం.. ఎవరికి లాభం? ఎవరికి నష్టమో తెలుసా?
అప్పుల నుంచి బయటపడే రాశులివే.. ఇక ఆనందం సమయమే..
అప్పుల నుంచి బయటపడే రాశులివే.. ఇక ఆనందం సమయమే..
చిన్న పిల్లల కళ్లకు కాటుక పెడుతున్నారా? అయితే వారికి ఈ ముప్పు
చిన్న పిల్లల కళ్లకు కాటుక పెడుతున్నారా? అయితే వారికి ఈ ముప్పు
ఇంట్లోనే బరువు తగ్గడానికి ట్రై చేసేవారికి బెస్ట్ హోమ్ వర్కవుట్..
ఇంట్లోనే బరువు తగ్గడానికి ట్రై చేసేవారికి బెస్ట్ హోమ్ వర్కవుట్..
కేవలం రూ.50లతో రూ.35 లక్షలు పొందే ఛాన్స్!
కేవలం రూ.50లతో రూ.35 లక్షలు పొందే ఛాన్స్!
డ్రైఫ్రూట్స్‌లో పురుగులా? ఇలా చేస్తే నెలల తరబడి తాజాగా ఉంటాయ్
డ్రైఫ్రూట్స్‌లో పురుగులా? ఇలా చేస్తే నెలల తరబడి తాజాగా ఉంటాయ్
చీపురు ఏ దిక్కున పెడితే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది..?
చీపురు ఏ దిక్కున పెడితే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది..?
రెండు చేతుల్లో ఆ గుర్తు ఉంటే తిరుగులేని ధనయోగం.. ఎందుకో తెలుసా?
రెండు చేతుల్లో ఆ గుర్తు ఉంటే తిరుగులేని ధనయోగం.. ఎందుకో తెలుసా?
 మీ ఇంట్లో వాడుతున్న స్క్రబ్బర్ సురక్షితమేనా?.. షాకింగ్ రిపోర్ట్!
 మీ ఇంట్లో వాడుతున్న స్క్రబ్బర్ సురక్షితమేనా?.. షాకింగ్ రిపోర్ట్!