CM Revanth Reddy: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో రేవంత్ మార్క్..! ఒక్క దెబ్బతో ఆ విమర్శలకు చెక్

తెలంగాణలో ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజకీయ వేడిని పెంచింది. తెలంగాణ వ్యక్తిని ఉపరాష్ట్రపతి బరిలో నిలిపి కాంగ్రెస్ సరికొత్త చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం వెనక సీఎం రేవంత్ కీ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనతో రేవంత్ రాజకీయ విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు చంద్రబాబును సైతం ఇరుకున పెట్టారని విశ్లేషకులు అంటున్నారు.

CM Revanth Reddy: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో రేవంత్ మార్క్..! ఒక్క దెబ్బతో ఆ విమర్శలకు చెక్
Cm Revanth Reddy

Edited By:

Updated on: Aug 20, 2025 | 9:02 PM

ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో జాతీయ స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపించినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమిని ఏకతాటిపైకి తీసుకువచ్చి తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి నుంచి రాధాకృష్ణన్‌ నామినేషన్ దాఖలు చేశారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి బరిలో నిలపడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు విశ్లేషకులు అంటున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపికతో సీఎం రేవంత్ రాహుల్ గాంధీతో గ్యాప్ ఉందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టడంతో పాటు ఏపీ సీఎం చంద్రబాబును ఇరకాటంలో పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి చెందిన పీవీ నరసింహా రావుకు ప్రధాని అవకాశం రావడంతో రాజకీయంగా టీడీపీకి కాంగ్రెస్ బద్ధ శత్రువు అయినప్పటికీ ఎన్టీఆర్ పీవీకి సంపూర్ణ మద్దతు ప్రకటించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సీఎం చంద్రబాబు, జనసేన ఛీఫ్ పవన్ కల్యాణ్‌తో పాటు కిషన్ రెడ్డి బండి సంజయ్ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీంతో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ను ఇరుకున పెట్టినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి ఎంపిక చేయడంలో కీరోల్ పోషించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఒక నిర్ణయంతో అటు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలను ఇరుకన పెట్టడంతో పాటు రాజకీయ విమర్శలకు చెక్ పెట్టారని విశ్లేషకులు అంటున్నారు. మరి ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ ఏ విధంగా స్పందిస్తారు..? ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..