CM KCR: కేంద్రంపై తగ్గేదేలే అంటోన్న కేసీఆర్‌.. మరోసారి హస్తిన బాట పట్టనున్న గులాబీ బాస్..

|

Apr 15, 2022 | 7:38 PM

CM KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తగ్గేదేలే అంటున్నారు. బీజేపీని టార్గెట్‌గా చేసుకుని పోరును మరింత ఉధృతం చేసేందుకు ముందుకు కదులుతున్నారు గులాబీ దళపతి.

CM KCR: కేంద్రంపై తగ్గేదేలే అంటోన్న కేసీఆర్‌.. మరోసారి హస్తిన బాట పట్టనున్న గులాబీ బాస్..
Cm Kcr
Follow us on

CM KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తగ్గేదేలే అంటున్నారు. బీజేపీని టార్గెట్‌గా చేసుకుని పోరును మరింత ఉధృతం చేసేందుకు ముందుకు కదులుతున్నారు గులాబీ దళపతి. మొన్నటికి మొన్న వరివార్‌పై ఢిల్లీలో సమరశంఖం పూరించిన ముఖ్యమంత్రి.. మరోసారి హస్తిన టూర్‌కు సమాయత్తమవుతున్నారు. కాషాయం పార్టీపై పోరులో భాగంగా మరో రెండురోజుల్లో ఢిల్లీకి వెళ్లబోతున్నారు సీఎం కేసీఆర్‌. ఈసారి వారం రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. పర్యటనలో భాగంగా రైతు నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కొత్త వ్యవసాయ పాలసీలు, చట్టాలపై చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా ఉత్తరప్రదేశ్‌ వెళ్లనున్నారు. లఖింపూర్‌ ఖేరీ హింసాకాండలో అసువులు బాసిన అన్నదాతల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతు కుటుంబాలకు సాయం చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని గతంలోనే ప్రకటించారు కేసీఆర్‌. ఇప్పుడీ మాటను నిలబెట్టుకునేందుకు డిల్లీతో పాటు యూపీకి కేసీఆర్‌ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

కాగా తెలంగాణలో పండిన వరిని కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ గత కొన్ని రోజులుగా టీఆర్‌ఎస్‌ ఉద్యమిస్తు్న్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేసీఆర్‌ నాయకత్వంలో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా దీక్షకు కూడా ఉపక్రమించారు. రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష పేరుతో తెలంగాణ భవన్‌ లో నిర్వహించిన ఈ దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

Also Read:Tollywood : ఒక్క సాంగ్‌తో పెరిగిపోతున్న సినిమా రేంజ్.. పాపులర్ పాటే మూవీకి భారీ ప్రమోషన్

keerthi suresh: దేవకన్య కూడా నీ అందం ముందు దిగదుడుపే.. అందాల ముద్దుగుమ్మ ‘కీర్తి సురేష్’..

Sonarika Bhadoria:అందంతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటున్న చేప కళ్ళ సుందరి ‘సోనారిక భాడోరియా’