తెలంగాణ వంద శాతం లౌకిక రాష్ట్రం.. క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో సీఎం కేసీఆర్

| Edited By:

Dec 21, 2019 | 2:28 AM

తెలంగాణ వందకు వంద శాతం లౌకిక రాష్ట్రమన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు.. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్‌… క్రిస్మస్‌ కేక్‌ను కట్‌చేశారు. క్రైస్తవులందరికీ క్రిస్మస్, న్యూ ఈయర్ […]

తెలంగాణ వంద శాతం లౌకిక రాష్ట్రం.. క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో సీఎం కేసీఆర్
Follow us on

తెలంగాణ వందకు వంద శాతం లౌకిక రాష్ట్రమన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు.. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్‌… క్రిస్మస్‌ కేక్‌ను కట్‌చేశారు. క్రైస్తవులందరికీ క్రిస్మస్, న్యూ ఈయర్ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారత్ ఎంతో గొప్పదేశమని.. ఇతర దేశాల్లో కేవలం ఏడాదికి రెండు మూడు పండుగలు జరుపుకుంటే.. మనం మాత్రం ప్రతి నెల ఏదో ఒక పండుగ జరుపుకుంటామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధి గురించి ప్రసంగించారు. రాష్ట్రంలో తాగు నీరు సమస్య, కరెంట్ సమస్య లేకుండా తయారు చేయగలిగామని.. 23.. 24 ఏళ్లలో కట్టే కాళేశ్వరం ప్రాజెక్టును.. కేవలం నాలుగేళ్లలో పూర్తిచేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో కాళేశ్వరం ద్వారా 70 నుంచి 75 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామన్నారు.