CM KCR: మాతో కలిసి రండి.. జాతీయ రాజకీయాలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రితో చర్చించిన సీఎం కేసీఆర్..

|

Sep 11, 2022 | 4:43 PM

ఎన్డీఏ(NDA), యూపీఏ(UPA) తరహా పీపుల్ ఫ్రంట్ అవశ్యకతపై..సీఎం కేసీఆర్ అభిప్రాయ పడినట్లుగా తెలుస్తోంది. తాను పెట్టబోయే జాతీయ పార్టీ గురించి కుమారస్వామికి..

CM KCR: మాతో కలిసి రండి.. జాతీయ రాజకీయాలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రితో చర్చించిన సీఎం కేసీఆర్..
Kumaraswamy Met With Cm Kcr
Follow us on

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు(CM KCR)తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HD Kumara Swamy) భేటీ ముగిసింది. ఇరువురు జాతీయ రాజకీయాలపై చర్చించినట్లుగా సమాచారం. ఎన్డీఏ(NDA), యూపీఏ(UPA) తరహా పీపుల్ ఫ్రంట్ అవశ్యకతపై..సీఎం కేసీఆర్ అభిప్రాయ పడినట్లుగా తెలుస్తోంది. తాను పెట్టబోయే జాతీయ పార్టీ గురించి కుమారస్వామికి వివరించారు సీఎం కేసీఆర్. పార్టీ అజెండా, అంశాలను వివరించారు. జాతీయ స్థాయిలో తనతో పాటు కలిసిరావాలని కోరారు సీఎం కేసీఆర్. తమతో కలిసి రావాలని కుమారస్వామిని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేసేందుకు.. కుమారస్వామి సుముఖత వ్యక్తం చేశారు. శనివారం రాత్రి 10 గంటలకు కుమారస్వామి హైదరాబాద్‌కు వచ్చారు.

రాత్రి ఐటీసీ గ్రాండ్‌ కాకతీయలో బస చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్‌ కు వచ్చిన కుమారస్వామి.. రెండు గంటల పాటు సీఎం కేసీఆర్‌తో జాతీయ రాజకీయాల గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్న సీఎం కేసీఆర్‌తో కర్ణాటక అగ్రనేత భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం ఇవాళ రాత్రి కుమారస్వామి బెంగళూరు వెళ్లనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం