Bhatti Vikramarka: తొందరెందుకు.. కాంగ్రెస్ జాబితా ప్రకటనపై క్లారిటీ ఇచ్చిన భట్టి విక్రమార్క..

|

Aug 22, 2023 | 9:42 AM

Telangana Congress: అధికార పార్టీ BRS రేసు గుర్రాలెవరో తేలిపోయింది!. మరి, కాంగ్రెస్‌, బీజేపీ ఎప్పుడు అభ్యర్ధుల్ని ప్రకటించబోతున్నాయ్‌!. షెడ్యూల్‌ వచ్చేవరకూ ఆగుతాయా? లేక నోటిఫికేషన్‌ తర్వాతే అనౌన్స్‌ చేస్తాయా?. బీజేపీ సంగతేమోగానీ.. కాంగ్రెస్‌ జాబితా ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చేశారు భట్టివిక్రమార్క. ఇంతకీ, కాంగ్రెస్‌ లిస్ట్‌ ఎప్పుడు రాబోతోంది!.

Telangana Congress: అధికార పార్టీ BRS రేసు గుర్రాలెవరో తేలిపోయింది!. మరి, కాంగ్రెస్‌, బీజేపీ ఎప్పుడు అభ్యర్ధుల్ని ప్రకటించబోతున్నాయ్‌!. షెడ్యూల్‌ వచ్చేవరకూ ఆగుతాయా? లేక నోటిఫికేషన్‌ తర్వాతే అనౌన్స్‌ చేస్తాయా?. బీజేపీ సంగతేమోగానీ.. కాంగ్రెస్‌ జాబితా ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చేశారు భట్టివిక్రమార్క.. తెలంగాణ ఎన్నికల కోసం.. బీఆర్‌ఎస్‌ లిస్ట్‌ ప్రకటించేసింది. ఒకేసారి 115మంది అభ్యర్ధుల్ని ప్రకటించిన గులాబీ పార్టీ దళపతి సీఎం కేసీఆర్‌.. కారు ఫస్ట్‌ గేర్ వేశారు. మరి, ఈసారి అధికారం తమదేనంటోన్న కాంగ్రెస్‌ ఏం చేయబోతోంది!. ఎప్పుడు జాబితా ప్రకటించబోతోంది!. బీఆర్‌ఎస్‌కి పోటీగా షెడ్యూల్‌ కంటే ముందుగానే అభ్యర్ధుల్ని అనౌన్స్‌ చేస్తుందా అంటే?. తొందరెందుకంటున్నారు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క. కేసీఆర్‌ ఆత్రం చూస్తుంటే, కోయిల ముందే కూసినట్టుగా ఉందంటూ సెటైర్లేశారు. కాంగ్రెస్‌ కూడా త్వరలోనే అభ్యర్ధుల్ని ప్రకటిస్తుందన్నారు భట్టి. ఆల్రెడీ ప్రొసీజర్‌ కూడా స్టార్ట్‌ అయ్యిందన్నారు. అయితే, ఎన్నికల షెడ్యూల్‌ తర్వాతో లేక నోటిఫికేషన్‌ వచ్చాకో లిస్ట్‌ ఉండొచ్చంటూ సంకేతాలిచ్చారు భట్టి. మరి, కేసీఆర్‌లాగా ఒకేసారి అభ్యర్ధుల్ని ప్రకటిస్తుందా? లేక విడతలవారీగా జాబితాలు విడుదల చేస్తుందో చూడాలి!. అయితే, బీఆర్‌ఎస్‌ మాదిరిగా ఎట్‌ఏటైమ్‌ లిస్ట్‌ ప్రకటించడం కాంగ్రెస్‌ వల్ల కాదంటున్నారు పొలిటికల్‌ ఎక్స్‌పర్ట్స్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..