Choppadandi MLA Ravishanker: ఉగాది పండుగ పూట అందరూ ఇంట్లో ఉండి కుటుంబసభ్యులతో సంతోషంగా సంబురంలో మునిగి తేలుతారు. కానీ ఆ వ్యక్తి మాత్రం పండుగను పక్కకు పెట్టి రోడ్లపైకి వచ్చారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోండంటూ వేడుకుంటున్నారు. అంతేకాదు ముఖానికి మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి మాస్కులు అందజేసి.. కరోనా బారిన పడకుండా ప్రజల ప్రాణాలను కాపాడుకోండి కోరుతున్నారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఉగాది పండుగ రోజున మాస్కులు లేకుండా ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతుండటంతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గమనించారు. కరోనా సెకండ్‌వెవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఇంట్లోంచి రోడ్డు మీదికొచ్చారు. మండుటెండల్లో రెండుగంటలపాటు నిలబడి మాస్క్‌లు లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారికి మాస్కులు అందించి, వారికి మాస్కు పై అవగాహన కల్పించారు.
మాస్క్ ధరించకుండా బయటకు రావొద్దన్నారు ఎమ్మెల్యే రవిశంకర్ జనానికి హితవు పలికారు. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలన్నారు. అయితే రెండు గంటలపాటు మండుటెండలో నిల్చొని ప్రజల కొరకు మాస్కులు అందించిన ఎమ్మెల్యేను చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పండుగ రోజున ప్రజారోగ్యంపై ఇంత శ్రద్ధ వహిస్తున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలిన రవిశంకర్ పిలుపునిచ్చారు.
కాగా, తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సెకండ్ వేవ్ ప్రభావంగా చాలా ఉంది. దీంతో కేసుల తీవ్రత పెరుగుతుండటంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు జనంలో అవగాహన కల్పిస్తున్నారు. కోవిడ్ కట్టడికి ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తోంది ప్రభుత్వం. అయినప్పటికీ ప్రభుత్వం నిబంధనలు బేఖాతరు చేస్తూ రోడ్లపైకి వస్తున్నారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే రవిశంకర్ చెబుతున్నారు.
Read Also.. Viral News: పెళ్లి కొడుకు బుల్లెట్ అడిగితే వధువు తరఫువాళ్లు అపాచీ బైక్ ఇచ్చారు.. దీంతో వరుడు బట్టలు విప్పేసి