TSRTC Employees: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో ఉద్యోగ భద్రత మార్గదర్శకాలపై సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్..

TSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చుకున్నారు.

TSRTC Employees: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో ఉద్యోగ భద్రత మార్గదర్శకాలపై సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్..
CM KCR

Updated on: Feb 05, 2021 | 5:15 AM

TSRTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే అశంపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని పరిశీలించిన సీఎం కేసీఆర్.. మార్గదర్శకాలపై గురువారం నాడు సంతకం చేశారు. జీతాల పెంపు, ఉద్యోగ భద్రత సహా 26 డిమాండ్లతో 2019లో ఆర్టీసీ ఉద్యోగులు 52 రోజుల పాటు సమ్మె చేసిన విషయం తెలిసిందే. అయితే ఉద్యోగుల సమ్మె విరమణ అనంతరం సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను పలువురిని ప్రగతి భవన్‌కు పిలిపించుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఉద్యోగ భద్రత సహా పలు అంశాలపై భరోసా ఇస్తూ హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ఉద్యోగ భద్రతపై సంతకం చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also read:

Dog and Horse Friendship: గుర్రాన్ని వాకింగ్‌కు తీసుకెళ్లిన కుక్కపిల్ల.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న వీడియో..

Oppo New Smart Phones: ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. అదిరిపోయే ఫీచర్లతో విడుదలకు సిద్ధమైన ఒప్పో స్మార్ట్ ఫోన్స్..