చికెన్ ధర ఏ మాత్రం కిందకు దిగనంటుంది. ఆదివారం కదా.. నాన్ వెజ్ టేస్ట్ చేద్దామనుకున్న జనాలకు.. చికెన్ షాపు ముందు బోర్డులు యథావిధిగా షాకిచ్చాయి. ప్రస్తుతం కేజీ 300లకు పైనే ఉంది. స్కిన్ లెస్ ధర రూ.340-360 మధ్య ఉంది. అదే బోన్ లెస్ అయితే కిలోకి 400 చెల్లించాల్సిందే. లైవ్ కోడి అయితే కిలో 170-200 వరకూ పలకుతోంది. నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ధరలు భారంగా మారాయి. ఇంకో 100 పెడితే హాఫ్ కేజీ మటన్ వస్తుందిగా అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. కానీ కోడి మాంసం మాత్రమే తినేవాళ్లు.. చికెన్‌కు అంత రేటు పెట్టలేక నిట్టూరుస్తున్నారు.
ధర పెరగడంతో గణనీయంగా పెరగడంతో విక్రయాలు తగ్గాయని అంటున్నారు వ్యాపారులు. మండుతున్న ఎండలతో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. అంతేకాదు రా మెటీరియల్ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయి. ఫారాల్లోని కోళ్లు వేడికి తట్టుకోలేక చనిపోతున్నాయి. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. కిలో మటన్ ధర 800 రూపాయలు పలుకుతోంది. అయితే చికెన్ కూడా మటన్‌తో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది.
ఓ వైపు మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. మరోవైపు చికెన్ ధరలు పెరగడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రత్యేకంచి ఏపీలో చిత్తూరు జిల్లాలోనే బ్రాయిలర్, లేయర్ కోళ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉంటోంది. అక్కడ ఉత్పత్తి తగ్గడం, అదే సమయంలో ఎండలకు పిల్లలు చనిపోవడంతో ఉత్పత్తి తగ్గిపోయింది. తాజా అంచనాల ప్రకారం మరో రెండు, మూడు వారాల పాటు ఇవే ధరలు ఉండొచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..