Chicken Prices: బ్యాడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు.. ఇప్పుడు కేజీ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరుగుతున్నాయి. జనవరిలో సంక్రాంతి సందర్భంగా కిలో రూ.350కి చేరుకోగా.. ఆ తర్వాత డిమాండ్ తగ్గడంతో తగ్గుముఖం పట్టి ఊరటనిచ్చాయి. ఇప్పుడు మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. దీంతో నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగిలినట్లయింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

Chicken Prices: బ్యాడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు.. ఇప్పుడు కేజీ ఎంతంటే..?
Chciken Prices

Updated on: Mar 08, 2026 | 9:09 AM

నాన్ వెజ్ ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. చికెన్ ధరలు భారీగా పెరిగి ఒక్కసారిగా మాంసం ప్రియులకు షాకిచ్చాయి. కిలో చికెన్ ఏకంగా మళ్లీ రూ.300కి చేరుకుంది. ఇవాళ ఆదివారం కావడంతో నాన్ వెజ్ తినేందుకు ప్రతీఒక్కరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీంతో చికెన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. ఈ కారణంతో షాపులన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. సండే హాలీడే కావడంతో ఇంట్లో నాన్ వెజ్ వంటకాలు వండుకుంటూ ఉంటారు. ప్రధానంగా తక్కువ ధరకు దొరికే చికెన్ ఎక్కువమంది తింటూ ఉంటారు. ధరలు పెరిగినా చికెన్ అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో పెరుగుదల నమోదైంది. మొన్నటివరకు ప్రాంతాలను బట్టి కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.250 నుంచి రూ.260 వరకు ఉండగా.. ఇప్పుడు ఏకంగా పలు ఏరియాల్లో రూ.300కి చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.290 నుంచి రూ.300 మధ్య విక్రయిస్తున్నారు. ఇక డ్రస్‌డ్ చికెన్ రూ. 260గా ఉండగా.. రిటైల్ లైవ్ బర్డ్ రూ.177గా ఉంది. ఇక ఫామ్స్‌లో లైవ్ బర్డ్ రూ.150గా కొనసాగుతోంది. ఇక వరంగల్‌లో కిలో స్కిన్‌లెస్ రూ.290, ఆసిఫాబాద్‌లో రూ.300, కామారెడ్డిలో రూ.280-300కు లభిస్తోంది. అటు విజయవాడలో కేజీ స్కిన్‌లెస్ రూ.300కి చేరుకుంది.

తగ్గిన గుడ్ల ధరలు

చికెన్ ధరలు పెరిగినప్పుడు సాధరణంగా గుడ్ల ధరలు కూడా పెరుగుతుంటాయి. కానీ ఈసారి కాస్త భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. చికెన్ ధరలు పెరుగుతుండగా.. గుడ్ల ధరలు మాత్రం పడిపోతున్నాయి. 30 గుడ్ల ట్రే ధర రూ.130 నుంచి రూ.140 మధ్య పలుకుతోంది. 12 గుడ్ల రిటైల్ ధర రూ.60గా ఉంది. ఇరాన్-ఇజ్రాయోల్ మధ్య యుద్ద ప్రభావంతో ఇండియా నుంచి విదేశాలకు గుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీని వల్ల ఇండియాలో నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల ధరలు పతనమయ్యాయి. ఇది సామాన్యులకు ఊరటగా చెప్పవచ్చు. మొన్నటివరకు ఒక్కో గుడ్డు ధర రూ.5 నుంచి రూ.6 వరకు పలకగా..  ఇప్పుడు రూ.4కే వస్తోంది. అటు మొన్న బర్డ్‌ఫ్లూ వల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండాకాలం మొదలవ్వడం, ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకోవడంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉత్పత్తి తగ్గిపోవడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో చికెన్ ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మరికొంతకాలం పాటు ధరలు ఇలాగే కొనసాగే అవకాశముందని పాల్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫామ్స్‌లో కోళ్ల ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గుతాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us