Weather Forecast: ఉపరితల ఆవర్తనంతో నైరుతికి బూస్టప్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

| Edited By: Phani CH

Jul 05, 2023 | 7:38 AM

అలా కురిసి ఇలా ఆగిపోయిన వర్షాల కోసం ఇప్పుడు రైతన్నలతో పాటు జనం కూడా ఎదురు చూస్తున్నారు. ఎండాకాలం ఎక్స్‌టెన్షన్‌తో బెంబేలెత్తిపోతున్న జనానికి చల్లని కబురు అందుతోంది. నెమ్మదించిన నైరుతికి బూస్టప్‌ ఇచ్చేలా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

అలా కురిసి ఇలా ఆగిపోయిన వర్షాల కోసం ఇప్పుడు రైతన్నలతో పాటు జనం కూడా ఎదురు చూస్తున్నారు. ఎండాకాలం ఎక్స్‌టెన్షన్‌తో బెంబేలెత్తిపోతున్న జనానికి చల్లని కబురు అందుతోంది. నెమ్మదించిన నైరుతికి బూస్టప్‌ ఇచ్చేలా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 72గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్రంలోని 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

6 జిల్లాలకు భారీ వర్ష సూచన..

నిజామాబాద్‌, జగిత్యాల, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌లో వర్షాలు పడతాయి. ఇక సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, యాదాద్రి, వనపర్తి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది.

ఆవర్తనంతో నైరుతిలో కదలిక..

ఇక ఏపీలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో పిడుగులు, ఈదురు గాలులతో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. అలా కురిసి ఇలా ఆగిపోయిన వర్షాల కోసం రైతులతో పాటు జనం కూడా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..