Kishan Reddy: తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం చొరవను వివరించిన కిషన్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం కీలకంగా వ్యవహరిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మిల్లెట్ల పరిశోధన, రైల్వే భద్రత, నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా సమగ్ర ప్రగతికి పునాది వేస్తోందన్నారు. ప్రజావసరాలు, పరిశోధనలలో రాష్ట్రం మంచి పురోగతి సాధించిందన్నారు. పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం పదండి..

Kishan Reddy: తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం చొరవను వివరించిన కిషన్ రెడ్డి
Kishan Reddy - PM Modi

Updated on: May 23, 2025 | 8:35 PM

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి తెలంగాణకు పలు కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.  రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడం, పరిశోధనలను ప్రోత్సహించడం, ప్రజాప్రయోజన కార్యక్రమాలను అమలు చేయడంపై కేంద్రం నిరంతర కృషి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతా విధానాల ఫలితంగా, తెలంగాణకు సమగ్ర అభివృద్ధి సాక్ష్యంగా నిలిచిందని చెప్పారు.

1. మిల్లెట్ పరిశోధనలో ప్రపంచ కేంద్రం – హైదరాబాదు

  • మిల్లెట్ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటించేందుకు కేంద్రం పలు దేశాలతో ఒప్పందాలు చేసుకుంది.
  • తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR) ద్వారా మిల్లెట్లపై పరిశోధన ఇప్పటికే జరుగుతోంది.
  • రూ. 250 కోట్ల వ్యయంతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ స్థాపనకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది.
  • ఈ కేంద్రం పూర్తిగా పని చేయడం మొదలైన తర్వాత, మిల్లెట్ల పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతమవుతుంది.
  • హైదరాబాదులో స్థాపించనున్న ఈ కేంద్రంలో సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లాబ్, ఇంటర్నేషనల్ హాస్టల్, మిల్లెట్ మ్యూజియం, ట్రైనింగ్ రూమ్‌లు, ఆధునిక పరిశోధనా ల్యాబ్‌లు ఉంటాయి.
  • రైతులకు అధిక నాణ్యత గల మిల్లెట్ విత్తనాలు అందిస్తారు.

2. కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ – సికింద్రాబాద్

  • భారతదేశ స్వదేశీ రైల్వే భద్రతా సాంకేతికత కవచ్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసింది.
  • మొదటగా రూ. 41.11 కోట్లతో ప్రారంభమైన ఈ కేంద్రం, ఇప్పుడు రూ. 274 కోట్ల వ్యయంతో మరింత విస్తరించబడుతోంది.
  • 5జీ సాంకేతికతపై టెస్టింగ్ సదుపాయాలను IIT-చెన్నైతో కలిసి అభివృద్ధి చేశారు.
  • ఈ కేంద్రం రైల్వే సంకేతాలు, భద్రత సంబంధిత పరిశోధన, ఇంజనీరింగ్ శిక్షణ, సంస్థల భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేస్తుంది.
  • MGIT (హైదరాబాద్), MMM యూనివర్శిటీ (గోరఖ్‌పూర్), MBM యూనివర్శిటీ (జోధ్‌పూర్) వంటి సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పరచబడ్డాయి.

3. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (NSTI) – హైదరాబాదు

  • వికసిత్ భారత్ ప్రణాళికలో భాగంగా, రూ. 60,000 కోట్ల వ్యయంతో ఐటీఐలను అభివృద్ధి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది.
  • ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (NCOE) లను నైపుణ్యాల అభివృద్ధి కోసం రూపొందిస్తున్నారు.
  • రూ. 200 కోట్లతో ఈ నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను అభివృద్ధి చేస్తారు.
  • NSTI, శిక్షకులకు ప్రీ-సర్వీస్, ఇన్-సర్వీస్ శిక్షణ అందించడంతో పాటు ఆధునిక మౌలిక సదుపాయాలతో నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిబద్ధతతో పని చేస్తోందని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఉదాహారణలతో సహా వివరిస్తున్నారు. పరిశోధన, శిక్షణ,  రైతులకు మద్ధతు వంటి అన్ని రంగాల్లో కేంద్రం చేపట్టిన చర్యలు, రాష్ట్రాన్ని ఆర్థికంగా, సాంకేతికంగా ముందుకు నడిపించాయని ఆయన చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.