Traffic Restrictions: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా నేడు హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రమ యాత్ర (Praja Sangrama Yatra) ముగింపు సందర్భంగా బహిరంగ సభకు హాజరు కానున్నారు. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా హాజరై ప్రసంగించనున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తుక్కుగూడ వైపు వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు నగర పోలీసులు. ఎల్‌బీనగర్, హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వారు ప్రత్యమ్నాయ మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెం.14 నుంచి మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు భారీ వాహనాలు అనుతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. అమిత్ షా సభ కోసం ఇప్పటికే బీజేపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 40 ఎకరాల్లో 5 లక్షలకు మించి జనాలతో ఈ సభను ఏర్పాటు చేశారు.
కాగా, లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు స్థానాల్లో విజయం సాధించినప్పటి నుంచి బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు అమిత్ షా రాష్ట్రానికి ఎక్కువ సార్లు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడ జరిగే సభలో వేదికపై దాదాపు 150 మందికిపై కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.
అమిత్ షా షెడ్యూల్ ఇలా..
శనివారం హైదరాబాద్‌కు రానున్న అమిత్ షా.. మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట విమానాశ్రయింలో దిగనున్నారు. 3 గంటలకు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీని సందర్శించి సాయంత్రం 4.30 గంటల అక్కడ గడిపి.. 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవా టెల్ హోటల్‌కు వెళ్తారు. 6.30 గంటలకు హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా హాజరవుతారు. అనంతరం రాత్రి 8 గంటలకు సభ స్థలి నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చి రాత్రి 8.25 గంటలకు ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు. కాగా, అమిత్ షా పర్యటన ఖరారు కావడంతో సభకు భారీ సంఖ్యలో ప్రజలను సమీకరించడంలో బీజేపీ నిమగ్నమైంది. అయితే సభకు 5 లక్షల మందిని తరలించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సభలో అమిత్‌షా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి