Telangana News: తెలంగాణలోని పేదలకు కేంద్రం సూపర్ న్యూస్.. నేరుగా ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.1.50 లక్షలు..
తెలంగాణలోని పేదలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద అదనంగా మరికొన్ని ఇళ్లను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనల మేరకు కేంద్రం ఇళ్లు కేటాయించడంతో పాటు నిధులు కూడా విడుదల చేసింది.

తెలంగాణలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్ణణ(పీఎంఏవై) 2.0 పథకం కింద రాష్ట్రంలోని పేదలకు ఇళ్లను మంజూరు చేసింది. రాష్ట్రానికి అదనంగా 8,338 ఇళ్లను తాజాగా కేటాయించింది. ఈ మేరకు ఇళ్ల నిర్మాణానికి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్ సిగ్నల్ అందించింది. ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.125.07 కోట్లను కూడా ప్రకటించింది. ఇందులో తొలి విడత కింద రూ.50 కోట్లను విడుదల చేసింది. ఢిల్లీలో సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సమగ్ర నివేదికలు, ప్రతిపాదలను కేంద్రం పరిశీలించి ఆమోదం తెలిపింది.
పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల కోసం తెలంగాణలోని చాలామంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. ఎప్పుడెప్పుడు ఇళ్లు మంజూరవుతాయా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు కేంద్రం కేటాయించడంలో లబ్దిదారులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. గతంలో ఈ పథకం కింద రాష్ట్రానికి కేంద్రం రూ.173.58 కోట్లు కేటాయించింది. వాటిల్లో కేవలం రూ.63 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇక ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి రూ.112 కోట్లు కేటాయించగా.. రూ.54.79 కోట్లు మాత్రమే ఉపయోగించుకుంది. 28,930 మంది లబ్దిదారులకు కేంద్రం నిధులు మంజూరు చేయగా.. కేవలం 14,343 మందికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. దీంతో మిగిలిన సొమ్మును కూడా లబ్దిదారులకు వెంటనే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. మిగతా నిధులు కూడా ఖర్చు చేయాలని సూచించింది. నిధులను పెండింగ్‌లో పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక పీఎం ఆవాస్ యోజన మొదటి దశలో కేటాయించిన ఇళ్లను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. అప్పటిలోగా పూర్తి చేస్తేనే కేంద్రం నుంచి సబ్సిడీలు, రాయితీలు వస్తాయి. ఆ గుడవు దాటిన తర్వాత ఎలాంటి సబ్సిడీలు రావని కేంద్రం తేల్చిచెప్పింది. లబ్దిదారులకు నిధులు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడింది. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునేవారు గరిష్టంగా 12 నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలని తెలిపింది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోపు విద్యుత్, రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. మౌలిక వసతులు కల్పించిన తర్వాతనే కేంద్రం నుంచి మూడో వాయిదా నిధులను క్లెయిమ్ చేసుకోవాలని తెలిపింది. ఇక అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ కింద ఇప్పటివరకు 1,36,125 ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే కేవలం 92,241 ఇళ్లల్లో మాత్రమే లబ్దిదారులు చేరారని కేంద్రం పేర్కొంది.
