గద్వాల జిల్లాలో ప్రమాదం.. వాగులో కొట్టుక పోయిన కారు

|

Jul 25, 2020 | 8:50 AM

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జోగులాంబ గ‌ద్వాల‌ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. క‌లుగొట్ల వాగు స‌మీపంలోవద్ద వాగు..

గద్వాల జిల్లాలో ప్రమాదం.. వాగులో కొట్టుక పోయిన కారు
Follow us on

వ‌ర్షాలు దంచికొడుతుండ‌డంతో వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి.. ఇదే స‌మ‌యంలో వాగు దాటుతున్న ఓ కారు వ‌ర‌ద ఉధృతికి కొట్టుకుపోయింది. అయితే. కారులో ఉన్న ముగ్గురిలో.. ఇద్దరు ప్రయాణికులు సుర‌క్షితంగా బయటపడగా.. మరొకరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జోగులాంబ గ‌ద్వాల‌ జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. క‌లుగొట్ల వాగు స‌మీపంలోవద్ద వాగు ఉప్పొంగింది.  ఇది గమనించని డ్రైవర్ కారును ముందుకు తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న శ‌నివారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది.

బెంగళూరులో ఉంటున్న శివ‌కుమార్ రెడ్డి త‌న భార్య సింధూ రెడ్డి, మరో మిత్రుడు జిలానీ బాషాతో క‌లిసి హైద‌రాబాద్‌కు శుక్ర‌వారం రాత్రి బ‌య‌ల్దేరారు.  శ‌నివారం తెల్ల‌వారుజామున 6:30 గంట‌ల స‌మ‌యంలో.. పుల్లూరు మీదుగా హైవే ఎక్కేందుకు క‌లుగొట్ల వాగు వైపు వెళ్లారు. అక్క‌డ వ‌ర‌ద ఉధృతి ఎక్కువ ఉండ‌టంతో.. కారు కొట్టుకుపోయింది. ఈ ప్ర‌మాదం నుంచి శివ‌కుమార్ రెడ్డి, జిలానీ బాషా సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే శివకుమార్ రెడ్డి భార్య సింధూ రెడ్డి వ‌ర‌ద నీటిలో గ‌ల్ల‌తైంది. వెంటనే సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. గల్లంతైన మహిళ కోసం గాలిస్తున్నారు.