గుండెపోటు వచ్చినప్పటికీ బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడాడు కర్నాటక ఆర్టీసి డ్రైవర్. హైదరాబాద్ నుంచి కర్నాటక లోని హోసాపేట్ కు వెళుతున్న ఆర్టీసి బస్సు మహబూబ్ నగర్ పట్టణానికి చేరుకుంది. ఆర్టీసి బస్టాండుకు చేరుకునే ముందు బస్సు డ్రైవర్ ఏనుమప్పకు గుండెపోటు వచ్చింది. బస్సు అటూ ఇటూ తిరగడాన్ని గమనించిన కండక్టర్(అతను కూడా డ్రైవరే) డ్రైవర్ వద్దకు వెళ్లి చూసే సరికి ఓ పక్కకు ఒరిగిపోతున్నాడు. ఏమైందని అడుగుతూనే అతన్ని పక్కకు జరిపి డ్రైవింగ్ సీట్లో కూర్చొని బస్సును కంట్రోల్ చేశాడు, బస్సును నేరుగా ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చాడు. హుటాహుటీన డ్రైవర్ కు చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ప్రాణాలు వదిలాడు.
గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ప్యాసింజర్లను మరో కర్నాటక బస్సులో పంపించారు. ప్రస్తుతం డ్రైవర్ మృత దేహం మార్చూరీలో ఉంది. తన ప్రాణాలు పోతున్నప్పటికీ బస్సులో ఉన్న ప్రయాణికులకు ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడ్డ ఆర్టీసి డ్రైవర్ ను అందరు ప్రశంసించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..