ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా ఇవ్వాల్సిందే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్..
కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా ఇస్తామని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా ఇస్తామని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ఎందుకు మారుస్తున్నారని మండిపడ్డారాయన. ఎల్‌ఆర్ఎస్‌తో రాష్ట్ర ప్రజలపై 20వేల కోట్ల రూపాయల భారం ప్రభుత్వం మోపనుందని ఆరోపించారు కేటీఆర్. దీనిపై ఎల్లుండి అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ నిరసన వ్యక్తం చేస్తుందని కేటీఆర్ అన్నారు.
మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ శంఖారావం పూరించింది. ఈ నెల 12న కరీంనగర్ బహిరంగ సభతో ప్రచారం ప్రారంభించేందుకు సిద్దమైంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటన చేయనున్నారు కేసీఆర్. బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు కూడా నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రచారం కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది బీఆర్‌ఎస్ పార్టీ. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు. ఈ క్రమంలోనే నేడు కరీంనగర్, పెద్దపల్లి అభ్యర్థులను ప్రకటించనున్నారు కేసీఆర్.