Kazipet Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై ప్రధానీ మోదీ స్పందించాలన్న వినోద్ కుమార్

ఎన్నో ఏళ్లుగా పోరాటం సాగుతున్న కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్ కుమార్ స్పందించారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలనేది 40 సంవత్సరాలుగా కొనసాగుతున్న డిమాండ్ అని చెప్పారు.

Kazipet Coach Factory: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై ప్రధానీ మోదీ స్పందించాలన్న వినోద్ కుమార్
Vinod Kumar
Follow us
Aravind B

|

Updated on: Jun 30, 2023 | 5:46 AM

ఎన్నో ఏళ్లుగా పోరాటం సాగుతున్న కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు వినోద్ కుమార్ స్పందించారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలనేది 40 సంవత్సరాలుగా కొనసాగుతున్న డిమాండ్ అని చెప్పారు. గత ప్రభుత్వాలు.. ఈ ఫ్యాక్టరీని ఇస్తామని చెప్పినప్పటికీ.. ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం కావడంతో ఎన్నో ఉద్యమాలు చేసినట్లు తెలిపారు. కాజీపేటకు రావల్సిన ఫ్యాక్టరీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయనట్లు ఆరోపించారు. అయితే జులై 8న ప్రధాని మోదీ వరంగల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై స్పందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు రైల్వేశాఖ మంత్రి ఏ రాష్ట్రానికి చెంది ఉంటే ఆ రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీలను కేటాయించారని గుర్తుచేశారు.

అలాగే విభజన చట్టంలో కూడా కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలనే అంశం ఉందని పేర్కొన్నారు. కానీ దాన్ని పట్టించుకోకుండా వేరే రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారని విమర్శించారు. గత ఏడాది గుజరాత్‌లో ఎన్నికల సందర్భంగా అక్కడ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారన్నారు. అలాగే మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే ఇప్పుడు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా పిరియాడికల్ ఓవర్ హాలింగ్‌ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. వ్యాగన్లు శుభ్రం, మరమ్మత్తు చేసే ఓవర్ హాలింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోదీ రావడం విడ్డూరంగా ఉందని ఆశ్యర్యం వ్యక్తం చేశారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..