Group-4: గ్రూప్-4 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి.. అభ్యర్థులకు కీలక సూచనలు చేసిన టీఎస్‌పీఎస్సీ
జులై 1న గ్రూప్-4 పరీక్ష జరగనుంది. ఇప్పటికే ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి టీఎస్‌పీఎస్‌సీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర విద్యాశాఖ సెలవు ఇచ్చింది.

జులై 1న గ్రూప్-4 పరీక్ష జరగనుంది. ఇప్పటికే ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి టీఎస్‌పీఎస్‌సీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు పరీక్ష కేంద్రాలున్న పాఠశాలలు, కళాశాలలకు రాష్ట్ర విద్యాశాఖ సెలవు ఇచ్చింది. అయితే ఇందుకు ప్రత్యామ్నాయంగా జులై 8న రెండో శనివారం రోజును వర్కింగ్ డే గా ప్రకటించింది. అయితే రాష్ట్రంలో మొత్తం 8,801 గ్రూప్-4 పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీకి జులై1 న పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ పరీక్ష కోసం రాష్ట్రంలో దాదాపు 2,846 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రెండు సెషన్స్‌లో గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10.00 AM నుంచి మధ్యాహ్నం 12.30 PM పేపర్-1 పరీక్ష ఉంటుంది. అలాగే రెండవ సెషన్‌లో మధ్యాహ్నం 2.30 PM గంటల నుంచి సాయంత్రం 5.00 PM గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అయితే ఈ పరీక్షకు మొత్తం 9 లక్షల 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులకు ఉదయం 9.45 AM వరకు, అలాగే మధ్యాహ్నం 2.15 PM వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..