Telangana: కూలీ పనులకు వెళ్లే రైతులకు దూరంలో మసకగా కనిపించింది.. దగ్గరకెళ్లి పరిశీలించగా

రోజూ ఉదయాన్నే ఎవరి పనులకు వాళ్లు వెళ్తున్నారు.. అలా నాలుగు రోడ్ల కూడలి దగ్గరకు చేరుకోగానే.. అక్కడ కనిపించిన సీన్ చూసి దెబ్బకు షాక్ అయ్యారు. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి హడలిపోయారు. ఇంతకీ ఏం కనిపించిందంటే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: కూలీ పనులకు వెళ్లే రైతులకు దూరంలో మసకగా కనిపించింది.. దగ్గరకెళ్లి పరిశీలించగా
Representative Image

Edited By:

Updated on: Mar 12, 2026 | 6:02 PM

మూఢనమ్మకాలతో నిర్వహిస్తున్న క్షుద్రపూజలు పరిసర గ్రామాలు పడలెత్తిపోయేలా చేస్తున్నాయి. తాజాగా హనుమకొండ జిల్లాలోని ఓ గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు పొట్టేలును బలిచ్చి తలా మొండెం వేరు చేశారు. నాలుగు రోడ్ల కూడలి వద్ద ఆ పొట్టేలు కళేబరాన్ని వదిలేసి అక్కడ క్షుద్ర పూజలు నిర్వహించిన ఆనవాళ్లు ఊరంతా ఉలిక్కిపడేలా చేస్తుంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి క్రాస్ రోడ్ వద్ద ఈ క్షుద్రపూజలు కలకలం రేపాయి.

గుర్తుతెలియని వ్యక్తులు గ్రామశివారులో నాలుగు రోడ్ల కూడలి వద్ద పొట్టేలును బలిచ్చారు. అక్కడే పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్ర పూజలు నిర్వహించారు. గుర్తుతెలియని వ్యక్తులు పొట్టేలు తల, మొండెంను వేరు చేసి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. పసుపు, కుంకుమ, నిమ్మకాయలను కవర్‌లో పెట్టి కొబ్బరికాయలు కొట్టి రోడ్డుపైనే పూజలు చేశారు. ఆ మార్గంలో వెళ్తున్న వారు అక్కడ క్షుద్ర పూజలు జరిపిన ఆనవాళ్లు చూసి తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అయితే మూఢనమ్మకాలతో ఎవరో ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు.. ప్రజల భయాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు భయాందోళనకు గురయ్యేలా ఇలాంటి పూజలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇది చదవండి: పందులు రాకుండా ఇంటి చుట్టూ వల పెడితే.. ఏవో చప్పుళ్లు వినిపించాయ్.. వెళ్లి చూడగా

 

Follow Us