జీహెచ్‌ఎంసీపై ఈసారి కాషాయ జెండా ఎగరడం ఖాయం! ఇది బీజేపీ భరోసా! జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికివారు గెలుపు మీద కొండంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దుబ్బాక జోష్‌ను కంటిన్యూ చేస్తామని కమలనాథులు ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలించే అంశమని, హాఫ్ సెంచరీకి పైగా డివిజన్‌లు సాధిస్తామని చెబుతున్నారు. మెజార్టీ సీట్లను గెలుచుకుంటామని బీజేపీ నేతలు అంటున్నారు. భావోద్వేగాన్నే ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రచార చేసిన బీజేపీ – ఓటర్లు తమవైపే ఉన్నారన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా అగ్రనేతల క్యాంపెయిన్ కలిసి వస్తుందని భావిస్తోంది. ఇదిలాఉంటే, గత ఎన్నికల్లో పార్టీల బలాబలాలు పరిశీలిస్తే.. టిఆర్‌ఎస్ 99, ఎంఐఎం 44, బిజెపి 4, కాంగ్రెస్ 2, టిడిపి 1 స్థానాలను కైవసం చేసుకున్నాయి.