Telangana Elections: గజ్వేల్‌ నుంచి బరిలో ఈటల రాజేందర్‌.. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలంగాణ భారతీయ జనతా పార్టీ(టీబీజేపీ) ఎన్నికల తొలి జాబితా విడుదలైంది. ఫస్ట్‌లిస్టులో మొత్తం 52 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ఈ లిస్టుకు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బి.ఎల్. సంతోష్‌తో పాటూ కమిటీ సభ్యులైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్..

Telangana Elections: గజ్వేల్‌ నుంచి బరిలో ఈటల రాజేందర్‌.. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Telangana Bjp

Updated on: Oct 22, 2023 | 12:49 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ(టీబీజేపీ) ఎన్నికల తొలి జాబితా విడుదలైంది. ఫస్ట్‌లిస్టులో మొత్తం 52 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ఈ లిస్టుకు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బి.ఎల్. సంతోష్‌తో పాటూ కమిటీ సభ్యులైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, సీనియర్ నేత ఈటల రాజేందర్ ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల బరిలోకి దిగేందుకు కేంద్ర కమిటీ 52మందికిపైగా అభ్యర్ధులతో తొలి జాబితాకు ఆమోదముద్ర వేశారు.

వరుస భేటీలు.. వడపోతలు.. అంతకుమించి సుదీర్ఘ కసరత్తు.. వీటన్నింటి తర్వాత తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు బలాలు, బ్యాగ్రౌండ్‌, సామాజిక సమీకరణాల ప్రాతిపదికగా అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఎంపికలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, జనరల్‌ అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత దక్కేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఫస్ట్ లిస్ట్‌తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. బీసీ కార్డ్‌తో ఎన్నికలకు వెళ్లాలని.. ఇందులో భాగంగా బీసీ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తోంది టీబీజేపీ. ఎన్నికల్లో బీసీ నినాదం తమకు తిరుగులేని అస్త్రంగా మారుతుందని లెక్కలేసుకుంటోంది.

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో..

  • 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ
  • రెండు చోట్ల పోటీ చేయనున్న ఈటల రాజేందర్‌
  • హుజూరాబాద్‌, గజ్వేల్‌ నుంచి బరిలో ఈటల రాజేందర్‌
  • సిర్పూర్‌-పల్లవి హరీష్‌బాబు
  • బెల్లంపల్లి-శ్రీదేవి
  • ఖానాపూర్‌-రమేష్‌రాథోడ్‌
  • ఆదిలాబాద్‌-పాయల్‌ శంకర్‌
  • బోథ్-సోయం బాపురావు
  • నిర్మల్‌-ఆలేటి మహేశ్వర్‌రెడ్డి
  • ముథోల్‌-రామారావు పటేల్
  • ఆర్మూర్-పైడి రాకేష్‌రెడ్డి
  • జుక్కల్‌-అరుణతార
  • కామారెడ్డి-వెంకటరమణారెడ్డి
  • నిజామాబాద్‌ అర్బన్‌-ధనపాల్‌ సూర్యనారాయణగుప్తా
  • బాల్కొండ-అన్నపూర్ణమ్మ,
  • కోరట్ల-ధర్మపురి అర్వింద్
  • జగిత్యాల-బోగ శ్రావణి
  • ధర్మపురి-ఎస్‌.కుమార్‌
  • రామగుండం-కందుల సంధ్యారాణి
  • కరీంనగర్‌-బండి సంజయ్
  • చొప్పదండి-బొడిగె శోభ,
  • సిరిసిల్ల-రాణిరుద్రమ
  • మానకొండూర్‌-ఆరేపల్లి మోహన్‌
  • నర్సాపూర్-మురళీయాదవ్
  • పటాన్‌చెరు-నందీశ్వర్‌గౌడ్
  • దుబ్బాక-రఘునందన్‌రావు
  • కుత్బుల్లాపూర్‌-కూన శ్రీశైలంగౌడ్
  • ఇబ్రహీంపట్నం-నోముల దయానంద్‌గౌడ్
  • మహేశ్వరం-అందెల శ్రీరాములుయాదవ్‌

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి