అసెంబ్లీ వేదికగా చెప్తున్నా.. నిరూపిస్తే రాష్ట్రం విడిచి వెళ్లిపోతా..!

| Edited By:

Mar 16, 2020 | 4:31 PM

తెలంగాణ ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరారు. సీఏఏపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని.. సీఏఏ వల్ల దేశంలోని ఏ ముస్లిలకు గానీ.. ఇతర మతస్థులకు గానీ అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. సభలో ప్రభుత్వం సీఏఏ వ్యతిరేక తీర్మానం పెట్టడంతో.. తీర్మాన కాపీలను చించేస్తూ సభ నుంచి బయటికి వెళ్లారు. సీఏఏ,ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై.. ఏప్రిల్ మొదటి వారంలో […]

అసెంబ్లీ వేదికగా చెప్తున్నా.. నిరూపిస్తే రాష్ట్రం విడిచి వెళ్లిపోతా..!
Follow us on

తెలంగాణ ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరారు. సీఏఏపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని.. సీఏఏ వల్ల దేశంలోని ఏ ముస్లిలకు గానీ.. ఇతర మతస్థులకు గానీ అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. సభలో ప్రభుత్వం సీఏఏ వ్యతిరేక తీర్మానం పెట్టడంతో.. తీర్మాన కాపీలను చించేస్తూ సభ నుంచి బయటికి వెళ్లారు.

సీఏఏ,ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై.. ఏప్రిల్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తామని తెలిపారు. సీఏఏపై అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని.. తమకు చర్చించే అవకాశం ఇవ్వకుండానే ప్రభుత్వం తీర్మానం చేపట్టిందని మండిపడ్డారు. సభలో సంఖ్యాబలం చూసుకొని సీఏఏకు వ్యతిరేకంగా తీర్మాణం చేశారని.. అందుకు రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మద్దతు తెలిపాయని ఆరోపించారు.