Raja Singh Challenge: సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ మరోసారి సవాల్ విసిరారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించి పోలీసుల తీరుపై మరోసారి మండిపడ్డ ఆయన.. ఈ సవాల్ విసిరారు. ఐదు రోజుల్లోగా గోవుల అక్రమ తరలింపును అడ్డుకోకుంటే తానే నేరుగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు. ఆ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. బహుదూర్‌పుర పీఎస్ ముందు నుంచి ఆవులను అక్రమంగా తరలిస్తోన్న వీడియోను రాజాసింగ్ బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. ‘మీకు చేతకాకుంటే అనే పదాన్ని నేను ఉపయోగించవచ్చు. కానీ పోలీస్ కమిషనర్ అంటే నాకు గౌరవం ఉంది. ఇప్పటికైనా చెక్ పోస్టులు ఏర్పాటు చేయండి. రాజకీయ నాయకులపై కామెంట్స్ చేయటం కాదు.. అక్రమంగా గోవులను తరలిస్తోన్న వారిపై చర్యలు తీసుకోండి.’ అంటూ నేరుగా సీపీ సజ్జనార్‌కే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు.
కాగా, అవుల ఆక్రమ రవాణాకు సంబంధించిన అంశంలోనే గతంలో సీపీ సజ్జనార్‌పై రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించారు. అయితే సీపీ సజ్జనార్ సైతం రాజాసింగ్ పై అంతే స్థాయిలో మండిపడ్డారు. పోలీసుల గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అలా ఆ వివాదం కొన్ని రోజులు నడవగా.. రాజాసింగ్ మరోసారి పోలీసుల తీరును ఎండగడుతూ సవాల్ విసిరారు.
Also read: