Telangana BJP: టీ బీజేపీకి ట్రీట్‌మెంట్‌! ఇవాళ తెలంగాణకు సునీల్‌ బన్సల్‌..

తెలంగాణ బీజేపీకి సునీల్ బన్సల్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వబోతున్నారా? అంతర్గత సంక్షోబానికి చెక్‌ పెట్టనున్నారా? అటు ఢిల్లీ పెద్దల త్రిముఖ వ్యూహం ఫలిస్తుందా..? ముగ్గురికీ మూడు పదవులతో పరిస్థితి చక్కబెడతారా? బండిసంజయ్‌ మంతనాలు ఎంతవరకు వచ్చాయి ?

Telangana BJP: టీ బీజేపీకి ట్రీట్‌మెంట్‌! ఇవాళ తెలంగాణకు సునీల్‌ బన్సల్‌..
BJP

Updated on: Jul 04, 2023 | 7:00 AM

తెలంగాణ బీజేపీకి సునీల్ బన్సల్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వబోతున్నారా? అంతర్గత సంక్షోబానికి చెక్‌ పెట్టనున్నారా? అటు ఢిల్లీ పెద్దల త్రిముఖ వ్యూహం ఫలిస్తుందా..? ముగ్గురికీ మూడు పదవులతో పరిస్థితి చక్కబెడతారా? బండిసంజయ్‌ మంతనాలు ఎంతవరకు వచ్చాయి ? ఇంతకీ కమలం పార్టీలో ఏం జరగబోతోంది?

తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలతో సతమవుతున్న కేడర్‌ని సరిదిద్దే ప్రయత్నం చేస్తోంది అధిష్ఠానం. బండి-ఈటల వర్గంగా విడిపోయిన ఈ రెండు గ్రూపులో ఇప్పుడు నాయకత్వ మార్పు చర్చతో మరింత విభేదాలు బయటపడ్డాయి. మరోవైపు బండి, ఈటల సహా కిషన్‌రెడ్డిని వాడుకోని తెలంగాణలో అధికారం చేపట్టాలనే వ్యూహరచన చేస్తోంది. బండి సంజయ్‌కి కేంద్ర సహాయమంత్రి పదవి ఇచ్చి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని , ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‌ను నియమించాలని యోచిస్తోంది. ఐతే గ్రూపులుగా విడిపోయిన నేతలు, కార్యకర్తలు సోషల్‌మీడియాలో ఇష్టానుసారంగా ఆరోపణలు చేసుకుంటున్నారు.

మరోవైపు పదవిపై క్లారిటీ రావడంతో ఈటల రాజేందర్‌ అందర్నీ కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తనను వ్యతిరేకిస్తున్న జితేందర్‌రెడ్డి నివాసానికి వెళ్లి మరీ లంచ్‌ చేసి వచ్చారు ఈటల. ఇక రఘునందన్‌రావు తన అసంతృప్తిని బయటపెట్టి మళ్లీ తిరిగి అలాంటిదేమి లేదంటూ వివరణ ఇచ్చారు.

ఇక తెలంగాణ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జ్‌ సునీల్‌ బన్సల్‌ రెండ్రోజులపాటు తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టబోతున్నారు. అధ్యక్షమార్పు ప్రచారం నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పార్టీ సంస్థాగత వ్యవహారాలు మందగించాయి. అటు ఢిల్లీ వెళ్లిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కొందరు కీలక నేతలను కలిసి, ఆ తర్వాత సున్నీల్‌బన్సల్‌తోపాటు సమావేశంలో పాల్గొననున్నారు.

ఇంత జరుగుతున్నా…కొంతమంది సీనియర్‌ నేతలు మౌనంగా ఉన్నారు. డాక్టర్‌ లక్ష్మణ్‌, డీకే అరుణ, మురళీధర్‌రావుతోపాటు కొంతమంది సీనియర్లు సైలెంట్‌గా అంతా గమనిస్తున్నారు. ఐతే సునీల్‌ బన్సల్‌ రెండ్రోజుల పర్యటన టీ బీజేపీలో ఎలాంటి మార్పులు తెస్తుందనే చర్చ జోరుగా నడుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..