తెలంగాణలో మొదలైన పార్లమెంట్‌ హీట్‌.. మరి ఓటరు చూపు ఎటువైపు.!

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్న పాలక ప్రతిపక్షాలు.. మాటల తూటాలతో పొలిటికల్‌ హీట్‌ను పెంచేశాయి. మొన్నటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌... కొత్తగా రూలింగ్‌లోకి వచ్చిన కాంగ్రెస్‌... నువ్వానేనా అన్నట్టు తలపడుతుంటే... కమలనాథులు సైతం యుద్ధానికి మేమూ సిద్ధమంటున్నారు.

తెలంగాణలో మొదలైన పార్లమెంట్‌ హీట్‌.. మరి ఓటరు చూపు ఎటువైపు.!
Big News Big Debate
Follow us

|

Updated on: Jan 29, 2024 | 6:58 PM

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్న పాలక ప్రతిపక్షాలు.. మాటల తూటాలతో పొలిటికల్‌ హీట్‌ను పెంచేశాయి. మొన్నటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌… కొత్తగా రూలింగ్‌లోకి వచ్చిన కాంగ్రెస్‌… నువ్వానేనా అన్నట్టు తలపడుతుంటే… కమలనాథులు సైతం యుద్ధానికి మేమూ సిద్ధమంటున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు నెలలు కాలేదు… అప్పుడే పార్లమెంటు ఎన్నికల రచ్చ మొదలైంది. బస్తీమే సవాల్‌ అంటున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే… పరస్పరం పాలక ప్రతిపక్షాలు చేసుకుంటున్న విమర్శలు… రాజకీయ వేడిని రగులుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకునేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్‌… పార్లమెంటు పోరుపై ఫోకస్‌ పెట్టింది. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది ఆ పార్టీ అధిష్ఠానం. 24ఏళ్ల సుధీర్ఘ ప్రయాణంలో కారుకు ఇది స్వల్ప విరామమే అంటున్న కేటీఆర్‌.. మరింత వేగంతో పార్లమెంట్‌ ఎన్నిలకు దూసుకువస్తుందని.. కార్యకర్తల్లో భరోసా నింపుతున్నారు.

అయితే, బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్‌ ఇస్తోంది కాంగ్రెస్‌. కారు షెడ్డుకు పోయిందనీ.. ఇక తిరిగి వచ్చే ప్రసక్తే లేదని ఎద్దేవా చేస్తోంది. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ స్థానాల్లో భారీగా అసెంబ్లీ సెగ్మెంట్లను గెలుచుకున్న హస్తం పార్టీ.. ఇప్పుడు ఆ ఎంపీ స్థానాలపైనే గురిపెట్టింది. సరిగ్గా నడపడం చేతకాకే.. కారు బోల్తాకొట్టిందంటున్నారు కమలనాథులు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో పూర్తిగా బీఆర్‌ఎస్ అడ్రస్‌ లేకుండా పోవడం ఖాయమంటున్నారు. పదికి పైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న కాషాయనేతలు… ఆ దిశగా భారీ వ్యూహరచనే చేస్తున్నారు. అటు హస్తం.. ఇటు కమలం.. మధ్యలో కారు అన్నట్టుగా మారింది తెలంగాణలో రాజకీయ పరిస్థితి. మరి వచ్చే ఎన్నికల్లో జరగబోయేది ద్విముఖ పోరా? త్రిముఖ పోరా? అన్నదే తెలియాల్సి ఉంది. అసెంబ్లీలో మార్పు కోరుకున్న తెలంగాణ ఓటరు… పార్లమెంటు ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుచూపుతాడనేది ఆసక్తి రేపుతోంది.

10 బంతుల్లోనే 50 పరుగులు.. విల్ జాక్స్ ఆల్ టైమ్ రికార్డ్..
10 బంతుల్లోనే 50 పరుగులు.. విల్ జాక్స్ ఆల్ టైమ్ రికార్డ్..
దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
'పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా'.. వెంకటగిరిలో జగన్
'పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మారుస్తా'.. వెంకటగిరిలో జగన్
స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
స్టన్నింగ్ లు‏క్స్‏తో మతిపోగొడుతున్న ప్రియాంక..
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
బోణి కొట్టిన భారత అమ్మాయిలు.. మొదటి టీ20లో బంగ్లాపై ఘన విజయం
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
జరుగుతున్న మంచి కొనసాగాలంటే వైసీపీ గెలవాలి- జగన్
నెలల పసికందు బాల్కనీ నుంచి జారీఇలా మధ్యలో చిక్కుకుపోయాడు.! చివరకు
నెలల పసికందు బాల్కనీ నుంచి జారీఇలా మధ్యలో చిక్కుకుపోయాడు.! చివరకు
టీడీపీకి షాక్ ఇచ్చిన మహిళా నేత.. రాజీనామాతో కంగుతిన్న క్యాడర్..
టీడీపీకి షాక్ ఇచ్చిన మహిళా నేత.. రాజీనామాతో కంగుతిన్న క్యాడర్..
హీరోయిన్ సింధు మీనన్ కూతురిని చూశారా ?..
హీరోయిన్ సింధు మీనన్ కూతురిని చూశారా ?..
లోక్ సభ ఎన్నికల వేళ దేశంలో కాక రేపుతున్న రిజర్వేషన్ అంశం..
లోక్ సభ ఎన్నికల వేళ దేశంలో కాక రేపుతున్న రిజర్వేషన్ అంశం..