
మావోయిస్టులతో సంబంధాలు ఉన్న తెలంగాణలోని రాజకీయ నాయకులను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం సంచలన ట్వీట్ చేశారు. రాజకీయ రంగ స్థలంలో ప్రజాస్వామ్యం గురించి వల్లె వేస్తూ.. మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలారా వెంటనే సాయుధ వర్గాలతో ఉన్న సంబంధాలను తెంచుకోండి. లేనిపక్షంలో మీ గుట్టు బయటపడుతుందని ఆయన హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్ర సంస్థలు మావోయిస్టు నిర్మూలనకే పరిమితం కావడం లేదు.. అవినీతి, నేరం, ఉగ్రవాద సంబంధాల నెట్వర్క్‌ను సైతం వెలికి తీస్తున్నాయి. దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరు అని రాసుకొచ్చారు. దేశ అంతర్గత భద్రత విషయంలో తప్పు వైపు నిలబడితే ఎంతటి ఉన్నత నాయకులైనా పతనం కాక తప్పదు” అని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయ నాయకులకు స్పష్టమైన హెచ్చరిక.
ప్రజాస్వామ్యం పేరుతో ప్రసంగాలు చేస్తూ, ఒకవైపు మావోయిస్టుల సాయుధ నెట్వర్క్లకు మద్దతు ఇస్తున్న వారు, వెంటనే తమ సంబంధాలను తెంచుకోవాలి. లేని పక్షంలో మీ బండారం బయట పడడం ఖాయం.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి మరియు కేంద్ర హోం… https://t.co/8wpTKX7SI0
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 19, 2025
ఇదిలా ఉండగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం తన శాఖ కార్యాలయాన్ని కర్తవ్య భవన్ లోకి మార్చారు. సెంట్రల్ విస్టా రీ డెవలెప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా నూతనంగా నిర్మించిన “కామన్ సెంట్రల్ సచివాలయం” ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత ఆగస్టు 6న ప్రారంభించిన సంగతి తెలిసిందే. సుమారు 1.5 లక్షా చదరపు మీటర్ల ప్లింట్ ఏరియా కలిగి ఉన్న ఈ భవనం, రెండు బేస్‌మెంట్‌లతో పాటు 7 అంతస్తులుగా నిర్మించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు సహాయ మంత్రి నిత్యానందరాయ్ కార్యాలయాలు ఇప్పటికే కర్తవ్య భవన్ లోని లెవెల్ 5లోకి మారాయి. దీపావళి సందర్భంగా ఈరోజు మంచి మహూర్తం ఉండటంతో బండి సంజయ్ పూజారుల వేద మంత్రోచ్చారణల కర్తవ్య భవన్ లోకి మధ్య అడుగుపెట్టారు. కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనకు కేటాయించిన సీట్లో ఆశీసునలయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.