Telangana BJP: నేడు బీజేపీ కార్పొరేటర్లతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్..

హెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని విజయం సాధించి భారీ స్థాయిలో కార్పొరేట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం నేపథ్యంలో..

Telangana BJP: నేడు బీజేపీ కార్పొరేటర్లతో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్..

Updated on: Dec 18, 2020 | 7:29 AM

Telangana BJP: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని విజయం సాధించి భారీ స్థాయిలో కార్పొరేట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో కలిసి నేడు చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. బీజేపీ విజయం సాధిస్తే అమ్మవారి దేవాలయంలో మొక్కులు చెల్లించుకుంటామని గతంలోనే బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన నేడు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే, జీహెచ్ఎంసీ ఫలితాలు వెల్లడైన మరుసటి రోజునే ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిన దర్శించుకుంటారని ప్రచారం జరుగగా.. వరుస పర్యటనల నేపథ్యంలో వీలు పడలేదు. దీంతో నేడు జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి వెళ్లనున్నారు.

ఇదిలాఉండగా, మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలు బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో డీకే అరుణ, లక్ష్మణ్, మురళీధర్ రావు సహా ఇతర నేతలు పాల్గొంటారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us