
ఈ నెల 8న హనుమకొండలో బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలసిందే. ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రదాని నరేంద్ర మోదీ రానున్నారు. దీంతో ఆయన ఏం మాట్లాడుతారో అన్న విషయాలపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే చాలామంది బీజేపీ శ్రేణులు మోదీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోసం ప్రధాని ఈ మధ్యలో వరస పర్యటనలపై దృష్టి పెట్టారు. ఇప్పుడు తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను మార్చనున్నట్లు వార్తలు కూడా ఇటీవల గుప్పుమన్నాయి. అయితే హనుమకొండ జరిగే సభకు జన సమీతకణపై ఆదివారం సాయంత్రం బీజేపీ నేతలు హనుమకొండలో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు.. రాష్ట్ర అధ్యక్షుడ్ని మారుస్తారనే ప్రచారం నడుస్తోంది.. ఇది నిజమేనా అని బండి సంజయ్‌ను అడిగారు.
ఈ విషయంపై బండి సంజయ్ స్పందించారు. మోదీ బహిరంగ సభకు కూడా రాష్ట్ర అధ్యక్షుని హోదాలో వస్తానో లేదో కూడా తెలియదని అన్నారు. బండి సంజయ్ వల్లే తెలంగాణలో బీజేపీ గ్రామస్థాయి వరకు విస్తరించిందని కార్యకర్తులు తెలిపారు. ఆయన పోరాడం వల్లే గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరాచకాలని ఎదుర్కొనగలుగుతున్నామని స్పష్టం చేశారు. మీరే అధ్యక్షునిగా కొనసాగాలి అంటూ పలువురు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. మీ కష్టం వృథా కాదని బండి సంజయ్‌కు భరోసా ఇచ్చారు. ఇక పార్టీ నిర్ణయమే తుది నిర్ణయమని.. ప్రధాని మోదీ పాల్గొనే సభను అందరూ విజయవంతం చేయాలని బండి సంజయ్ కార్యకర్తలకు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..