Telangana: గుండు ఎంత పనిచేసింది.. నవ్వకండి.. సీరియస్ మ్యాటర్ ఇక్కడ.. వీడియో
మహబూబాబాద్ జిల్లా కొమటిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులకు గుండు చేయించుకుని వచ్చిన కూలీకి ఫేస్ ఐడెంటిఫికేషన్ యాప్ ఊహించని ఇబ్బందులు తెచ్చింది. గుండు కారణంగా యాప్ అతడిని గుర్తించకపోవడంతో కూలీలు తంటాలు పడ్డారు. చివరకు పక్కనే ఉన్న మహిళ జుట్టును విగ్గులా పెట్టుకుని ఫోటో తీసిన తర్వాత యాప్ అంగీకరించడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఫేస్ రికగ్నేషన్ యాప్ వల్ల తరచూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉపాధిహామీ పథకంలో కూలీలా హాజరు నమోదు కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ ఐడెంటిఫికేషన్ యాప్ వలన కూలీలకు ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గుండుతో ఉన్న కూలీని ఆ యాప్ యాక్సెప్ట్ చేయక పోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు.. పక్కనే ఉన్న మహిళ కూలి జుట్టు తన నెట్టిన విగ్గులా అమర్చిన తరవాత ఆ యాప్ యాక్సెప్ట్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వింత సంఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కొమటిపల్లి గ్రామంలో జరిగింది.. శ్రీనివాస్ అనే కూలీ రెండు రోజుల క్రితం కొండగట్టుకు వెళ్లి అంజన్నస్వామి సన్నిధిలో తలనీలాలు సమర్పించాడు.. గుండు తో గురువారం ఉపాధి హామీ పనులకు హాజరయ్యాడు..
కూలీ పనికి వెళ్ళే ముందు నిబంధనల ప్రభావం (NMMS) నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా యాప్ లో ఫేస్ ఐడెంటిఫికేషన్ యాప్ లో హాజరు నమోదు చేసుకోవాలి.. గుండుతో కూలీ పనికి వచ్చిన శ్రీనివాస్ కు ఊహించని సమస్య వచ్చింది గుండు వల్ల యాప్ గుర్తించక పోవడంతో ఫేస్ ఐడెంటిఫికేషన్ కోసం పడరాని పాట్లు పడ్డారు.
వీడియో చూడండి..
పక్కనే ఉన్న మరో మహిళ జట్టును తన తల మీద విగ్గులా వేసుకోని ఫోటో తీసుకోవడంతో కూలీలందరు అవాక్కయ్యారు.. ఆ మహిళ తల వెంట్రుకలు నెత్తిన విగ్గులా పెట్టుకున్న తర్వాత ఫేస్ రికగ్నేషన్ యాప్ లో యాక్సెప్ట్ అయ్యింది.. ఈ విచిత్ర సంఘటన చూసి అక్కడున్న కూలీలు అంతా షాక్ అయ్యారు.. గుండుతో వచ్చిన ఆ కూలి ఐడియా అదుర్స్ అనిపించింది.. ఐతే ఫేస్ రికగ్నేషన్ యాప్ తో ఇలాంటి సాంకేతిక సమస్యలు చాలా ఎదురవుతున్నాయని కూలీలు అంటున్నారు.
