Bairi Naresh: ‘నాపై దాడి చేసింది అయ్యప్ప భక్తులు కాదు’.. ఏటూరునాగారం ఘటనపై స్పందించిన బైరి నరేష్.. వీడియో

|

Jan 02, 2024 | 3:47 PM

ఏటూరునాగారంలో జరిగిన ఘటనపై నాస్తికసంఘం నేత బైరి నరేష్ స్పందించారు. తన ఊపిరి ఉన్నంత వరకు మూఢ నమ్మకాల నిర్మూలన కోసమే పని చేస్తానంటూ పేర్కొన్నారు. ఏటూరునాగారంలో తనపై దాడి చేసింది అయ్యప్ప భక్తులు కాదని.. సివిల్ డ్రెస్‌లలో వచ్చినవారు ఉద్దేశ పూర్వకంగా తమపై దాడిచేశారన్నారు.

Bairi Naresh: ‘నాపై దాడి చేసింది అయ్యప్ప భక్తులు కాదు’.. ఏటూరునాగారం ఘటనపై స్పందించిన బైరి నరేష్.. వీడియో
Bairi Naresh
Follow us on

ఏటూరునాగారంలో జరిగిన ఘటనపై నాస్తికసంఘం నేత బైరి నరేష్ స్పందించారు. తన ఊపిరి ఉన్నంత వరకు మూఢ నమ్మకాల నిర్మూలన కోసమే పని చేస్తానంటూ పేర్కొన్నారు. ఏటూరునాగారంలో తనపై దాడి చేసింది అయ్యప్ప భక్తులు కాదని.. సివిల్ డ్రెస్‌లలో వచ్చినవారు ఉద్దేశ పూర్వకంగా తమపై దాడిచేశారన్నారు. బీజేపీ, మత వాదులే తమపై కుట్రలు పన్ని దాడిచేశారంటూ ఆరోపించారు. తాను ఏ అయ్యప్ప భక్తున్ని కారుతో ఢీకొట్టలేదని.. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. తమపై దాడులు చేసి అడ్డుకున్న వారిపై కేసులు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. సివిల్ డ్రస్ లో వచ్చిన వారు రెచ్చగొట్టారన్నారు. కారు ప్రమాదంలో తనకు, తన భార్యకు గాయాలయ్యాయన్నారు. తమను వెంబడించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాల్నారు. అయ్యప్పను కించ పర్చడం తన ఉద్దేశం కాదని.. తనకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని, తన భద్రత కోసం ప్రభుత్వం లైసెన్స్ వెపన్ మంజూరు చేయాలని బైరి నరేష్ కోరారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.

కాగా.. బైరి నరేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలని అయ్యప్ప భక్తులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా అయ్యప్ప భక్తుడి పైకి వాహనంతో ఢీకొట్టారని.. ఏటూరునాగారంలో అయ్యప్ప భక్తుల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నాస్తిక సమాజం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడమే నరేష్ కర్తవ్యమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. ఏటూరునాగారంలో అయ్యప్ప భక్తున్ని వాహనంతో ఢీకొట్టి గాయపర్చిన ఘటనలో బాధితుడి పిర్యాదు మేరకు బైరి నరేష్ పై పోలీసులు కేసు నమోదు చేచేశారు. సోమవారం ఏటూరునాగారం లో జరిగిన ఘటన అనంతరం జీడివాగు వద్ద నరేష్ వాహనం అదుపుతప్పి చెట్టును డీ కొట్టింది.. నరేష్ తో పాటు అతని భార్య, డ్రైవర్ కు గాయాలు కాగా.. వాహనం అక్కడే వదిలేసి నరేష్ బస్సులో వెళ్లిపోయారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..