
నగరంలోని బహదూర్‌పుర ఎమ్మెల్యే మొజంఖాన్‌కు సోమవారం రాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు నానల్‌నగర్‌లోని ఆలివ్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు ఆయన్ను ఐసీయూలో చేర్చి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బహదూర్‌పురా నుంచి ఆయన ఎంఐంఎం తరఫున పోటీచేసి విజయం సాధించారు. మొజంఖాన్‌కు గుండెపోటు వచ్చిందన్న సమాచారం అందుకున్న వెంటనే ఎంఐఎం పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆస్పత్రికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలంతా ఆస్పత్రి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు.