
ఓ గుంత.. స్పాట్‌లోనే 19 మంది ప్రాణాలు తీసింది. టిప్పర్ కెపాసిటీ 30 టన్నులైతే.. 60 టన్నుల లోడ్ వేయడం మరణాల సంఖ్య పెరగడానికి కారణమైంది. ఓవర్ లోడ్‌తో ఓవర్‌స్పీడ్‌తో వెళ్లడం ఘోర ప్రమాదానికి దారి తీసింది. చేవెళ్ల బస్ యాక్సిడెంట్‌కు ఇవన్నీ పైకి కనిపిస్తున్న కారణాలు. అసలు కారకులు.. అధికారులు. సకాలంలో రోడ్లు బాగు చేయనివాళ్లు, లోడ్‌కు మించి టిప్పర్ వెళ్తున్నా పట్టించుకోని అధికారులు, పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించిన వాళ్లు.. ఇలా అందరూ బాధ్యులే. ఒక చిన్న తప్పిదాన్ని సరిచేయకపోవడం వల్ల జరిగిన ఘోర ప్రమాదం ఇది. మరి.. ఎవరిని బాధ్యులను చేస్తారు? ఛార్జ్‌షీట్‌లో ఏ అధికారుల పేర్లు చేరుస్తారు? ఇన్ని చావులిచ్చావ్.. కాని కొన్నే కన్నీళ్లిచ్చావ్. తెలుగు ప్రజలు తేరుకునే లోపే.. వరుస ప్రమాదాలు సృష్టిస్తూ శవాల గుట్టలు పేర్చుతున్నావ్. ‘దేవుడా.. నీకిది తగునా అని కన్నీటితో ప్రశ్నిస్తోంది సామాన్యుడి మనసు. కంట తడి ఆరే లోపే మరింత విషాదం నింపుతూపోతుంటే.. గుండెలు బాదుకుంటూ ఏడ్చేవారి రోదన వింటుంటే.. చూసే వారి కళ్లు కూడా చెమ్మగిల్లుతున్నాయ్. యముడు నరకలోకం వీడి తెలుగు నేలనే కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకున్నాడేమో అనిపిస్తోంది ఈ వరుస ఘటనలు చూసి. యమకింకరులకు టార్గెట్ గానీ పెట్టాడేమో అనే అనుమానం వస్తోంది ఇన్ని చావులు చూసి. ఎంత చక్కగున్నారో చూడండి ఈ ముగ్గురు ఆడపిల్లలు. బంగారపు బొమ్మలు. చదువుల తల్లులు. చనిపోవాల్సిన వయసా ఇది. ఆడపిల్ల భారం అనుకునే...