చంటి బిడ్డలతో ప్రయాణం చేసే సమయంలో నలుగురిలో కూర్చుని పాలు ఇచ్చేందుకు తల్లులు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలో వారు ఇటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పర్యాటక ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలు, జన సమూహం అధికంగా ఉండే చోట్ల తల్లులు బిడ్డలకు పాలిచ్చేందుకు అనువుగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో.. కాచిగూడ(kachiguda) రైల్వే స్టేషన్ లో బేబీ ఫీడింగ్ రూం(Baby Feeding Room) ను ఏర్పాటు చేశారు. రైలు ప్రయాణం చేసే తల్లులు వారి శిశువులకు పాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ బేబీ ఫీడింగ్ రూం ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. నిజామాబాద్ కు చెందిన పురుషోత్తం సుమాని సహకారంతో.. రైల్వేస్టేషన్ కు వచ్చే చిన్నారుల తల్లులకు సౌకర్యంగా ఉండేందుకు ఈ గదిని ఏర్పరిచారు. రోటరీ క్లబ్ ఆఫ్ హైదరబాద్ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో అభిమాన్ అనే ప్రాజెక్ట్ లో భాగంగా పాలిచ్చే తల్లుల కోసం ఈ ఏర్పాటు చేశామని ఎంపీ అరవింద్ అన్నారు. మహిళల గౌరవాన్ని నిలబెట్టేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేయడం అవసరమని అన్నారు.
Also Read
Kala Thapasvi Rajesh: చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. జాతర మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్