YS Sharmila Engagement: వైఎస్ షర్మిల కుమారుడి నిశ్చితార్ధానికి హాజరైన ఏపీ సీఎం జగన్‌ దంపతులు.. వీడియో వైరల్

|

Jan 18, 2024 | 9:50 PM

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్‌ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో గురువారం (జనవరి 18) ప్రారంభమైంది. ఈ వేడుకకు షర్మిల అన్న, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి వైఎస్‌ భారత్‌ హాజరయ్యారు. కాబోయే జంటను పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సమేతంగా ఫొటోలు దిగారు..

YS Sharmila Engagement: వైఎస్ షర్మిల కుమారుడి నిశ్చితార్ధానికి హాజరైన ఏపీ సీఎం జగన్‌ దంపతులు.. వీడియో వైరల్
YS Sharmila Engagement
Follow us on

హైదరాబాద్‌, జనవరి 17: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్‌ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో గురువారం (జనవరి 18) ప్రారంభమైంది. ఈ వేడుకకు షర్మిల అన్న, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి వైఎస్‌ భారత్‌ హాజరయ్యారు. కాబోయే జంటను పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సమేతంగా ఫొటోలు దిగారు. వేడుకలో వైఎస్ విజయమ్మ, కుటుంబ సభ్యులు సందడి చేశారు.

నిశ్చితార్ధానికి హాజరైన వారిలో వైవి సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, కెవిపి రామచంద్రరావు సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. కుమారుడి నిశ్చితార్ధానికి రాజకీయాలకు అతీతంగా పలు పార్టీ అధినేతలను షర్మిల ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అందరికీ ఇన్విటేషన్‌ కార్డులను కూడా షర్మిల అందజేశారు. ఫిబ్రవరి 17న రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం జరగనుంది.

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ , మాజీ మంత్రి హరీష్ రావుతో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ ఎంగేజ్ మెంట్‌కు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.