AP CM Chandrababu: హైదరాబాద్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన టీడీపీ నేతలు, కార్యకర్తలు

|

Jul 05, 2024 | 7:35 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. సాయంత్రం 7 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. సాయంత్రం 7 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వస్తున్న ఆయనకు అడుగడున అభిమానులు స్వాగతం పలికారు. ఇందుకు కోసం టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ వరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, తోరణాలతో ఈ రూటు పసుపు మాయంగా మారింది. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి భారీ ర్యాలీగా చంద్రబాబును ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. నగర వాసులు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ర్యాలీ వద్దని టీటీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. దీంతో బేగంపేట నుంచి నేరుగా తన కాన్వాయ్‌లో నివాసానికి చేరుకున్నారు.

Published on: Jul 05, 2024 07:34 PM