Telangana Weather Report: దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. వాతావరణ కేంద్రం కీలక ప్రకటన..

|

Sep 09, 2021 | 7:35 AM

తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేసిన వరుణుడు కాస్త శాంతించాడు. పల్లెల్లో ఇప్పుడిప్పుడే పొడి వాతావరణం కనిపిస్తోంది. అయితే వర్షం తాలూకూ వరదలు ఇంకా ఊళ్లను చుట్టుముట్టే ఉన్నాయి. వర్షమైతే ఆగింది.. కానీ...

Telangana Weather Report: దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. వాతావరణ కేంద్రం కీలక ప్రకటన..
Rain
Follow us on

తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేసిన వరుణుడు కాస్త శాంతించాడు. పల్లెల్లో ఇప్పుడిప్పుడే పొడి వాతావరణం కనిపిస్తోంది. అయితే వర్షం తాలూకూ వరదలు ఇంకా ఊళ్లను చుట్టుముట్టే ఉన్నాయి. వర్షమైతే ఆగింది.. కానీ వరదలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.  అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో అల్పపీడన వార్తను మోసుకొచ్చింది. ఈ నెల 11 న బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో వానలు తగ్గుముఖం పట్టినా..  ఆ ప్రభావం ఇంకా కనిపిస్తోంది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి, తెలంగాణ కి దూరంగా కొనసాగుతుంది.

ఈ నెల 11 మరో అల్పపీడనం..

తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే ఈ నెల 11వ తేదీన ఉత్తర, మధ్య బంగాళాఖాతం దగ్గరలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే 11 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. జూన్ 1 నుంచి మంగళవారం వరకు సాధారణం కన్నా అత్యధిక వర్షపాతం నమోదైనట్లుగా వెల్లడించింది.  ఉత్తర తెలంగాణ లో సాధారణం కన్నా 40% అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. దక్షిణ తెలంగాణ లో సాధారణం కన్నా 8% తక్కువ వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి: Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?