
AP, Telangana, National News Live: ఆపరేషన్ సింధూర్‌తో భారత్ చేతిలో చావుదెబ్బలు తిన్న పాకిస్తాన్ కొత్త డ్రామాలు మొదలుపెట్టింది. మైండ్‌గేమ్‌తో భారత్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్. భారత్‌కు మిత్రదేశాలను దూరం చేసే కుట్రలను చేస్తున్నారు. సౌదీ అరేబియాతో భారత్‌కు ఎప్పటినుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. దీనిని చెడగొట్టే కుట్ర చేసింది పాకిస్తాన్. సౌదీ అరేబియాతో పాకిస్తాన్ డిఫెన్స్ డీల్ చేసుకోవడం భారత్‌పై కుట్రలో భాగంగానే భావించవచ్చు.
రియాద్‌లో పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య డిఫెన్స్ డీల్‌పై షాబాజ్ షరీప్, సౌదీ యువరాజు సంతకాలు చేశారు. సౌదీ అరేబియాతో చారిత్రక , వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ ఒప్పందం నిదర్శనమన్నారు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్. రెండు దేశాల్లో ఎవరిపైనా శత్రువు దాడి చేస్తే అది ఇద్దరిపైనా జరిగిన దాడిగా భావిస్తామని, అప్పుడు ఇరువురు ప్రత్యర్థితో పోరాడాలన్నది ఆ ఒప్పందం సారాంశం.
పాకిస్తాన్-సౌదీ అరేబియా డిఫెన్స్ డీల్‌పై విదేశాంగశాఖ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఈ ఒప్పందం పరిణామాలు ఎలా ఉంటాయనేదానిపై అధ్యయనం చేస్తోంది. ఈ ఒప్పందంతో భారత ప్రయోజనాలు దెబ్బతినకుండా చూస్తునట్టు విదేశాంగశాఖ ప్రకటించింది. పహల్గాం దాడి తరువాత అమెరికాకు దగ్గరయ్యింది పాకిస్తాన్. ఇప్పుడు సౌదీ అరేబియాతో కూడా ఒప్పందం చేసుకుంది.
సౌదీ లాంటి దేశాలను భారత్‌కు దూరం చేస్తే తమకు చాలా లాభం ఉంటుందని పాకిస్తాన్ భావిస్తోంది. భారత్-సౌదీ మధ్య ఎన్నో వ్యాపార ఒప్పందాలు ఉన్నాయి. సౌదీ నుంచి ముడి చమురు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. అందుకే పాకిస్తాన్ దొంగదెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి ఒప్పందమే నాటో దేశాల మధ్య కూడా ఉంది. తే నాటోలో 30కిపైగా దేశాలు ఉంటే.. ఇక్కడ మాత్రం రెండు దేశాలే. ఈ డీల్‌లో భాగంగా సౌదీకి పాకిస్తాన్ సైనిక సహాయం అందిస్తుంది. అవసరమైతే మిసైల్ ఢిఫెన్స్ అందించడంతోపాటు.. సౌదీలో తమ సైన్యాన్ని దింపుతుంది. గతంలో సౌదీ సైనికులకు శిక్షణ ఇచ్చిన పాక్.. ఆ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది. ఒప్పందంలో న్యూక్లియర్ కో-ఆపరేషన్ కూడా ఉందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఒప్పందంలో అణ్వాయుధాలు కూడా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
పాకిస్థాన్ సైనిక సాయానికి బదులుగా సౌదీ అరేబియా ఆర్థిక సహాయం చేస్తుంది. సంయుక్త సైనిక కార్యక్రమాలకు నిధులు అందిస్తుంది. అత్యాధునిక సాంకేతికతను అందిస్తుంది. సౌదీ మిలిటరీ బేస్‌లను వాడుకోవడానికి పాక్‌కు అనుమతి ఇస్తుంది. ఇక ఇరు దేశాలు కలిసి సంయుక్తంగా ఆయుధాలు, డ్రోన్లు, క్షిపణులను అభివృద్ధి చేసే అవకాశం కూడా ఉంది.
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలిని సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల శాంతినగర్ వాసి తులసిగా గుర్తించారు.
రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రారంభించనున్నట్లు అలయన్స్ ఎయిర్ సర్వీస్ సంస్థ తెలిపింది. వారానికి మూడు రోజులు మాత్రమే విమాన సర్వీసు అందుబాటులో ఉంటుందని తన ప్రకటనలో పేర్కొంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నాయకురాలు వినూత కోట బహిరంగ లేఖ రాశారు. జనసేన నేత కొట్టె సాయికి శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి ఇవ్వడంపై అభ్యంతరం. కొట్టె సాయి ప్రసాద్ కు పదవి ఇవ్వడంపై పునరాలోచించాలని విజ్ఞప్తి. కొట్టె సాయి ప్రసాద్ కు ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని లేఖ. మహిళలంటే కనీస గౌరవం లేని వ్యక్తికి పవిత్ర పుణ్యక్షేత్రమైన ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మెన్ పదవి ఇవ్వడం సమంజనం కాదు. నాపైన జరిగిన రాజకీయ కుట్రలో ప్రధానమైన వ్యక్తుల్లో కొట్టె సాయి ప్రసాద్ పాత్ర ఉంది. ఈ విషయాలను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రి నాదెండ్ల మనోహర్ తోపాటు మీ దృష్టికి తెచ్చాను. ఆధారాలు కూడా ఇచ్చాను.
నిజాయితీగా నిజంగా కష్టపడ్డ వారిని గుర్తించి ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను రాజకీయాలకు దూరం చేయాలని, క్యారెక్టర్ పై దెబ్బ కొట్టి కుట్రలు చేసిన వ్యక్తుల్లో కొట్టె సాయి ఉన్నారు. అలాంటి వ్యక్తికి పదవి ఇవ్వడం మంచిది కాదు. అర్హులు చాలా మంది జనసేన పార్టీ శ్రీకాళహస్తి లో ఉన్నారు. వారిని గుర్తించి నిర్ణయాన్ని పునరాలోచించు కోవాలని కోరుతున్నాను. త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నాయకురాలు వినూత కోట అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటికరీంచే కుట్రలను కూటమి, కేంద్రం ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. EOI లను రద్దు చేయాలి.. సొంత గనులను కేటాయించి.. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. కార్మిక నేతలపై కూటమి నాయకులు దుష్ప్రచారం ఆపాలని అన్నారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం మాణిక్యారం గుడితండాలో భూక్య కోటయ్య (49) అనే రైతు శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. చాతి నొప్పితో కింద పడిపోయిన కోటయ్యను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్, తుర్కయంజాల్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపుర్‌మెట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మణికొండ, గచ్చిబౌలి, నారాయణగూడ, సనత్‌నగర్, నాంపల్లి, కోఠి, మలక్‌పేట, చైతన్యపురి, ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, పెద్ద అంబర్‌పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో భిన్న వాతావరణం కనిపిస్తుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎండ.. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కుండపోత వర్షం కురుస్తోంది. మాములు కుండపోత వర్షం కాదు.. క్లౌడ్ బరస్ట్‌ని తలపించేలా వర్షం కురుస్తోంది. దీంతో నగర వాసుల్లో ఆందోళన నెలకొంది.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో అర్దరాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగింది. 30 తులాల బంగారం, 20 వేల నగదు అపహరణ. పోలీస్ జాగిలాలు, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్ నిపుణులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిన్న రాత్రి తిరుపతిలోని లీలా మహల్ సమీపంలో వెకిలి చేష్టలతో రోడ్డుపై హంగామా చేసిన యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఆరుగురు పోకిరీలను అరెస్టు చేసినా పోలిసులు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, రోడ్డు మీద వచ్చే వాహనదారులను ఇబ్బంది కలిగించిన యువకులు. ఎస్పీ ఆదేశాలతో యువకులు చందు, హరి, శివలపై BNS 118(1), 115(2), 324(4) తోపాటు 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు. అమెరికన్ బార్ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు.
శ్రీకాళహస్తి… తొట్టంబేడు మండలం చియ్యవరం గ్రామంలో కాటేసిన పాము తలకొరికి ఘటన చోటు చేసుకుంది. ఇంటిలో ఉన్న వెంకటేష్ అనే వ్యక్తిని కాటేసిన విషపూరిత కట్ల పాము. మద్యం మత్తులో కాటేసిన పామును పట్టుకొని దాని తల కొరికిన వెంకటేష్. చచ్చిన పామును అలానే పక్కన ఉంచుకొని నిద్ర పోయిన వెంకటేష్. ఉదయం కుటుంబ సభ్యులు చూసి, వెంకటేష్ ను ఆసుపత్రికి తరలింపు. వెంకటేష్ పరిస్థితి విషమం. తిరుపతి రుయా ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స.
బాలాజీ నగర్ లోని ఇంటి నెంబర్..1022లో నాగు పాము దర్శనమిచ్చింది. 8 అడుగుల నాగుపామును గుర్తించి భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చిన స్థానికులు. పాపనాశనము వద్ద 6 అడుగుల మరో నాగుపామును గుర్తించిన దుకాణదారులు. రెండు పాములను పట్టుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు. సేఫ్ గా రెండు పాములను పట్టుకుని శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన భాస్కర్ నాయుడు. ఊపిరి పీల్చుకున్న స్థానికులు.
టిక్‌టాక్ యాజమాన్య హక్కులపై అమెరికా-చైనాల మధ్య ముసాయిదా ఒప్పందం ఖరారైంది. తుది ఒప్పందం కోసం ట్రంప్-జిన్‌పింగ్ చర్చలు సాగిస్తున్నారు.
నటి జాన్వీ కపూర్ మువీ ‘ఆస్కార్ 2026’ ఎంట్రీ పొందింది. జాన్వీ, ఇషాన్ కట్టర్ కలిసి నటించిన సినిమా ‘హోమ్‌బౌండ్’ ఈ మేరకు ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీ పొందింది.
నల్గొండ పెద్దవూర మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. శాంతినికేతన్ ప్రైవేట్ పాఠశాల స్కూల్ బస్సు కిందపడి ఏడేళ్ల గౌతమ్ చక్రశాలి మృతి చెందాడు. ఒకటవ తరగతి చదువుతున్న గౌతమ్ మృతితో పాఠశాల ముందు విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి నాయకుల ధర్నా చేపట్టారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గౌతమ్ మృతి చెందాడని, విద్యార్థి గౌతమ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండు చేశారు. శాంతినికేతన్ పాఠశాలను సందర్శించిన డిఇఓ బిక్షపతి. ఘటనపై పూర్తి విచారణ చేసి స్కూల్ పై చర్యలు తీసుకుంటామని డీఈఓ హామీ ఇచ్చారు.
ఏకకాలంలో 20 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన ఈడీ. హైదరాబాద్‌తో పాటు ఏపీ, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పూర్, ఢిల్లీలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఏపీ లిక్కర్ స్కాం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4 వేల కోట్లు గండిపడినట్టు గుర్తింపు. కిక్ బ్యాగ్‌ల రూపంలో వేలకోట్ల మనీలాండరింగ్. సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు. నిన్న సోదాల్లో రూ.38 లక్షల నగదు స్వాధీనం. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఈడీ.
ప్రధాని మోదీ రేపు (సెప్టెంబర్ 20) గుజరాత్‌లో పర్యటించనున్నారు. ‘సముద్ర సే సమృద్ధి’ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి. భావ్‌నగర్‌లో రూ.34,200 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్న ప్రధాని. సముద్ర, ఎల్‌ఎన్‌జి మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, రహదారులు, ఆరోగ్య సంరక్షణ, పట్టణ రవాణా, బహుళ రంగాలకు సేవలు అందించే ప్రాజెక్టులు ప్రధాని ప్రారంభించనున్నారు. లోథాల్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌ను సందర్శించి, పురోగతిని ప్రధాని సమీక్షించనున్నారు. నౌకానిర్మాణం, ఓడరేవు ఆధునీకరణ, గ్రీన్ ఎనర్జీ, తీరప్రాంత కనెక్టివిటీ ద్వారా సాగరతీర ఆధారిత వృద్ధిపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో ధోలేరా లో ఏరియల్ సర్వే చేయనున్న ప్రధానమంత్రి.
జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదంకి సంబంధించి తాజాగా NTR టీం ప్రకటన విడుదల చేసింది. యాడ్ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు స్వల్పగాయాలయ్యాయని, పూర్తిగా కోలుకోవడానికి 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం NTR ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎన్టీఆర్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను ఎవరూ నమ్మొద్దని అభిమానులు, మీడియా, పబ్లిక్‌కు విజ్ఞప్తి చేసింది.
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు గాయలయ్యాయి. హైదరాబాద్‌లో ఓ యాడ్ షూటింగ్‌లో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు
మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు. నేను ఈరోజు ఎంతమందికి కండువాలు కప్పాను. వారికి కప్పిన కండువాలో ఏముందో వారికే తెలియదు. ఎవరింటికి వెళ్తే ఏ భోజనం పెడతారో తెలియదు కదా. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జీతాలలో 5000 రూపాయలు ఆ పార్టీకి వెళ్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.. ఆ మేరకు సమయం కేటాయించాలని హరీష్ రావు అసెంబ్లీలో ఆన్ రికార్డుగా చెప్పారని సీఎం రేవంత్ చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా మరో ట్విట్ చేశారు. నియోజకవర్గం స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని నేను భావిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయి. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేననే వాస్తవాన్ని ముఖ్యమంత్రి గుర్తించి వ్యవహరించాలని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
సెప్టెంబర్ 14న సైబరాబాద్‌లో ఇంట్లో ఒంటరిగా ఉన్న శివయ్య (70) అనే వృద్ధులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈకేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. వృద్ధుడి సమీప బంధువుగా గుర్తించిన ఓ మహిళ ఈ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. తనను దూషించి, అవమానించాడని కక్ష్య పెంచుకున్న బంధువు మంగ వృద్ధుడిని చంపింది.
మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనకాపల్లి ఎంపీ CM రమేశ్ ఫిర్యాదు చేసిన కేసులో గాదరి కిశోర్‌కు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు కోర్టులో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.
రాష్ట్రంలో 3 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ నాలుగు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో జనాలకు రెచ్చిపోయే ఆఫర్ ప్రకటించాడు. కేవలం రూ.5కే చొక్కా అమ్ముతున్నామని చెప్పడంతో ప్రజలు షాప్ ముందు బారులు తీరారు. అయితే ఈ ఆఫర్ వర్తించాలంటే నియమ, నిబంధనలు పెట్టాడు యజమాని. కొడంగల్ బస్టాండ్ వద్ద ఉన్న ఈ బట్టల షాప్ యాజమాని తన ఇన్ స్ట్రాగామ్ ఫాలోవర్స్ కోసం ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలిపాడు. మన ఫంకీ ఫ్యాషన్ పేరుతో ఉన్న తన షాప్ ఇన్ స్ట్రాగామ్ ఐడీ ఫాలోవర్స్ కు మాత్రమే అని నిబంధన పెట్టాడు. అంతేకాకుండా కేవలం 150 చొక్కాలు మాత్రమే ఆ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించాడు. అయితే ఈ ప్రత్యేక ఆఫర్ తన షాప్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రకటిస్తున్నట్లు యాజమాని తెలిపాడు. ఉదయం 8.30గంటల నుంచి మధ్యాహ్నం 11.00గంటల వరకు మాత్రమే ఈ ఆఫర్ చలామణిలో ఉంటుందని స్పష్టం చేశాడు.
ఇక ఈ రూ.5చొక్కా ఆఫర్ విషయం ఆ నోటా ఈనోటా దావాణంలా వ్యాప్తించడంతో తెల్లవారుజాము నుంచే యువకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వందలాది మంది గంటల పాటు దుకాణం ముందు క్యూ కట్టారు. ఇక షాప్ వద్దకు భారీగా జనం తరలిరావడంతో యాజమాని షాప్ తెరవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అతి కష్టం మీద ఎట్టకేలకు షాపు తెరిచి వచ్చిన వారికి రూ.5లకే చొక్కా అందించాడు. ఇక చొక్కా దక్కని వారు నిరాశగా తిరిగి వెళ్లిపోయారు. అయితే కొడంగల్ బస్టాండ్ కు సమీపంలోనే ఈ తతంగం అంతా జరగడంతో అందరూ వింతగా చూశారు.
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా ఎస్టేట్‌లో దోపిడీ. ఇంట్లో ఉన్న రామాసుందరి(73) అనే వృద్ధురాలి కంట్లో కారం చల్లి ఆమె మెడలో ఉన్న 6 తులాల బంగారు చైన్‌లను లాక్కెళ్లిన గుర్తు తెలియని మహిళ. భర్త నిరంజన్(77) మార్కింగ్ వాక్‌కు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఇంట్లో ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి దోపిడీ చేసినట్లు గుర్తింపు.
హైదరాబాద్.. కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో ఏకో సిరి మిల్లెట్ ఫుడ్ కోర్ట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వినియోగ దారుడికి పాయసంలో స్క్రబ్ తాలూకు ఇనుప ముక్కలు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు. తనిఖీ చేసిన అధికారులు ఫుడ్ కోర్టుకి నోటీసులు జారీ చేశారు.
మద్దిపాటి సంధ్యారాణి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు eow పోలీసులు గుర్తించారు. కందుకూరులో 4 ఎకరాలు, విజయవాడ గన్నవరంలో కమర్షియల్ కాంప్లెక్స్, గచ్చిబౌలి NCC, మణికొండ, కూకట్ పల్లి, ప్రగతినగర్‌లో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన సంధ్యారాణి. ఇటీవల ఆదిలాబాద్ లోని ఓ బ్యాంకు వేలంలో మూడు అంతస్తుల భవనం కొనుగోలు చేసిన సంధ్య రాణి. సంధ్యారాణికి చెందిన ఇండియా ఓవర్ సీస్, ఏస్బిఐ, యూనియన్ బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్న పోలీసులు. సంధ్యారాణి నుండి 4 కారులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సంధ్యారాణి కేసులో పలువురు ఆడిటర్‌లని విచారిస్తున్న eow. ఆడిటర్ కౌశిక్, ప్రశాంత్, హరిలను విచారిస్తున్న eow. ఆడిటర్‌ల ద్వారా ఏర్పడిన పరిచయాల ఆధారంగానే పలువురిని మోసం చేసిన సంధ్యారాణి. సంధ్యారాణి అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్న ముగ్గురి ఆడిటర్‌ల పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు.
అనంతపురం జిల్లా శెట్టూరు ఏపీ మోడల్ స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌పై విచక్షణారహితంగా దాడి చేసిన పదవ తరగతి విద్యార్థి. స్కూల్లో క్రమశిక్షణతో ఉండాలంటూ విద్యార్థిని మందలించిన ప్రిన్సిపాల్ శ్రీరాములు. ప్రిన్సిపాల్ మందలించడంపై ఆగ్రహించి ప్రిన్సిపాల్ పై దాడికి పాల్పడ్డ విద్యార్థి చరణ్. ఘటనపై ప్రిన్సిపాల్ శ్రీరాములు పోలీసులకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు. శెట్టూరు మోడల్ స్కూల్‌లోకి చేరుకున్న డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులు విచారణ చేపట్టి, విద్యార్థికి టీసి ఇచ్చి బయటికి పంపించేశారు. పదో తరగతి విద్యార్థి చరణ్ కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన పోలీసులు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా స్కూల్లో క్రమశిక్షణతో మెలగాలని మిగతా విద్యార్థులకు డీఎస్పీ రవిబాబు వార్నింగ్ ఇచ్చారు.
అనంతపురం జిల్లాలోని ఇద్దరు అంతరాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 35 లక్షల విలువ చేసే బంగారం, 35 వేల రూపాయల నగదు, రెండు బైక్ లు, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. కమ్మదూరు మండలానికి చెందిన జస్వంత్, భోగం రాజు అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పుట్లూరు పోలీసులు. నిందితులపై పలుచోట్ల 12 చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనట్లు గుర్తింపు. పక్క సమాచారంతో పుట్లూరు పోలీసులు, సీసీఎస్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 13 బిల్లులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీంలో చట్టసరణకు క్యాబినెట్ ఆమోదం. నాలా చట్టం రద్దు ప్రతిపాదించే చట్టానికి ఆమోదం. వైఎస్‌ఆర్ తాడిగడప మున్సిపాల్టీ పేరులో వైఎస్ ఆర్ పేరు తొలగిస్తూ చట్ట సవరణ. స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితా సవరణ బిల్లుకు ఆమోదం. జీఎస్టీ లో సంస్కరణలు అమలు -2025 బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం. ఎపీ ఆక్వాకల్చర్ డెవలప్ మెంట్ అథారిటీ చట్టసవరణ కు క్యాబినెట్ ఆమోదం.
ఎపీ విశ్వవిద్యాలయాల చట్టం లో పలు సవరణలకు క్యాబినెట్ ఆమోదం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం. టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులు కు జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ప్లాస్టిక్ వల్ల వచ్చే కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. ప్లాస్టిక్ ఉత్పత్తులు అరికట్టాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. సచివాలయం మొత్తం ప్లాస్టిక్ నిలిపి వేశాం. గాజు సీసాల్లో సచివాలయంలో నీటి సౌకర్యం ఏర్పాటు చేసాం. ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహిస్తూన్నాం. ప్లాస్టిక్ వల్ల లైఫ్ స్పాన్ పై ప్రభావం పడుతోంది. ప్లాస్టిక్ భూమిలో పూర్తిగా కలవడం లేదు. తల్లి పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. ప్లాస్టిక్ ఫ్రీ కాన్సెప్ట్‌ను తిరుమలలో అమలు చేస్తున్నాం. ప్లాస్టిక్ నిరోధానికి పొలిటికల్, సినిమా ఫంక్షన్ లకు ప్లెక్సీ లు నిషేదించాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి జరిగే కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఆలయ ఈవో వికె శీనానాయక్ ఆహ్వానం పలికారు. శుక్రవారం శాసనసభ విరామ సమయంలో పవన్ కళ్యా్‌ణ్‌ను కలిసి ఆహ్వాన పత్రికతోపాటు అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్‌కు వేద ఆశీర్వచనాలు అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు టికెట్ చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది. టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రధాన పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే సర్వీసులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలను సంస్థ సవరిస్తుందని క్లారిటీ ఇచ్చింది. స్పెషల్ బస్సుల్లో మాత్రమే సాధారణ చార్జీలో 50 శాతం వరకు సవరణ 2003 నుంచే అమల్లో ఉందని వివరించింది.
మాహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌లోని ముల్-మరోడా అటవి ప్రాంతంలో మ్యాన్ ఈటర్ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 12 మంది బృందంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సోమనాథ్ ప్రాజెక్ట్ సమీపంలో పులిని బందించిన అటవిశాఖ సిబ్బంది. పశువైద్య అధికారులు, రాపిడ్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారుల సాయంతో పులిని బందించిన రెస్క్యూ టీం. ప్రాథమిక చికిత్స అనంతరం పులిని చంద్రపూర్‌లోని సేఫ్ జోన్‌కు తరలింపు. తాజాగా మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని చిమూర్ తాలూకా అంబోలి ప్రాంతంలోని లావారీలో పులి దాడిలో మహిళ కూలీ మృతి చెందారు. స్థానికుల ఆందోళనతో పులి కోసం ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అటవిశాఖ.
రోడ్డుపై లారీలను ఆపి నిద్ర పోయే డ్రైవర్ల సెల్ ఫోన్లను నగదును అపహరించే ఇద్దరి వ్యక్తులను ఆలూరు పోలీసులు అరెస్టు చేశారు. గత నెల రోజుల క్రితం ఆలూరు సమీపంలో ఆగి ఉన్న లారీల దగ్గర ఇద్దరు వ్యక్తులు వెళ్లి ఒక లారీ డ్రైవర్ ను కత్తులతో గాయపరచి సెల్ ఫోన్, నగదును దోచుకెళ్లారు. పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేసి ఛేదించారు. పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరిలో ఒకరు కర్ణాటకలోని బళ్ళారి జిల్లా బసరకోడు గ్రామానికీ చెందిన మూర్తికాగా, మరొకరు గదగ్ జిల్లా చిక్క వాడితి గ్రామానికీ చెందిన పరమేష్‌గా గుర్తించారు. ఇద్దరు పలు దొంగతనలతో పాటు మర్డర్ కేసులలో కూడా ముద్దాయిలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
తెలంగాణలో 50% ఆర్టీసీ టికెట్ ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగలు వస్తే చాలు ఆర్టీసీ బస్సు ఛార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమవుతుండటం సిగ్గుచేటు. పల్లె వెలుగు సహా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం. అదనపు సర్వీసుల పేరిట 50శాతం అదనపు ఛార్జీల దోపిడీ.. ప్రయాణికులకు పెను భారంగా మారుతుంది. పండుగ సంబురం లేకుండా చేస్తుంది. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్‌గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుంది. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజా పాలన, ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోని కీలక నేతలతో పాటు కేంద్రంలో ఉన్న పలువురు బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్టు సిట్ గుర్తించింది. జడ్జిలు, సినీ నటుల ఫోన్లు సైతం ట్యాపింగ్ జరిగినట్టు సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి అప్పగించే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్. ఇప్పటికే కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ కేసును కూడా వారితోనే విచారణ చేయించాలనే యోచనలో ఉంది ప్రభుత్వం.
JKLF నేత యాసిన్ మాలిక్ ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు. 2006లో భారత ప్రభుత్వ సూచనల తోనే తాను పాకిస్తాన్‌లో లష్కర్ చీఫ్ , ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయాద్‌ను కలిసినట్టు వెల్లడించారు. భారత్‌కు వచ్చిన తరువాత తనకు అప్పటి ప్రధాని మన్మోహన్ ధన్యవాదాలు కూడా తెలిపారని అన్నారు.
ఉగ్రవాదం కేసులో యాసిన్ మాలిక్ ఢిల్లీ తిహార్ జైల్లో జీవితఖైదును అనుభవిస్తున్నారు. భారత నిఘా వర్గాల సూచనతోనే పాకిస్తాన్‌కు వెళ్లి హఫీజ్ సయీద్‌తో భేటీ అయినట్టు తెలిపారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాద నేతలతో చర్చలు జరపాలని తనను కోరినట్టు తెలిపారు.
ఫిరాయింపుల అంశంలో విమర్శలు గుప్పిస్తోన్న BRSకు MLA కడియం కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించారని, అప్పుడు గుర్తుకురాని నైతిక విలువలు ఇప్పుడు గుర్తుకొచ్చాయా అంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు, స్పీకర్ పరిధిలో ఉందని, స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇస్తానని అన్నారు. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి నా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు.
Vizag: విశాఖలో విమానం ఎక్కిన ప్రయాణికులకు పెద్ద ప్రమాదమే తప్పింది. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి విమానంలో గందరగోళం నెలకొంది. ఇంజన్లో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలెట్ ఏటీసీకి సమాచారం అందించాడు. ఏమైందని తెలుసుకునేలోపే.. మళ్లీ విశాఖలో ఆ ఫ్లైట్ సేఫ్ ల్యాండ్ అయింది. విషయం తెలుసుకున్న ప్రయాణికులు గుండెలు పట్టుకున్నారు. ఇక ప్రయాణం వద్దు బాబోయ్ అంటూ కిందకు దిగిపోయారు. కొందరు మరో ఫ్లైట్ ఎక్కితే.. మరికొందరు రిఫండ్ తీసుకొని ఫ్లైట్ వద్దు బాబోయ్ బస్సు బెటర్ అని వెళ్ళిపోయారు.
పాకిస్తాన్ తో సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం మధ్యప్రాచ్యం, ఆసియా అంతటా ప్రకంపనలు సృష్టించగా, భారతదేశం ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సిద్ధమవుతోంది. గురువారం (సెప్టెంబర్ 18), భారత వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ ఈ విషయంపై యుఎఇ విదేశాంగ మంత్రితో సమావేశమై చర్చలు జరిపారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యప్రాచ్యంలో ఒక ముఖ్యమైన దేశం. ఇజ్రాయెల్‌తో అబ్రహం ఒప్పందాలలో ఒక పార్టీ. ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడికి సంబంధించి ఇటీవల దోహాలో జరిగిన సమావేశానికి యుఎఇ ఏ ప్రముఖ నాయకులను పంపలేదు. ప్రపంచ దేశాలతో యూఏఈ వ్యుహాత్మక దౌత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇదిలావుంటే తాజాగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విదేశాంగ మంత్రితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్ మహానగరం శివారు కోకాపేట్‌లో దారుణం వెలుగు చూసింది. నిద్రిస్తున్న భర్తను కత్తితో పొడిచి చంపింది ఓ భార్య. రాత్రి దంపతుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. తీవ్రంగా గాయపడ్డ భర్త ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు.
తెలంగాణలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది పార్టీ ఫిరాయింపు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ ప్రక్రియను ప్రారంభించారు.
— ఫిరాయింపుల కేసులో MLAలకు స్పీకర్ నోటీసులు
— ఆరుగురు ఎమ్మెల్యేలు, BRS ఫిర్యాదుదారులకు నోటీసులు
— మరిన్ని ఆధారాలు కావాలని నోటీసుల్లో కోరిన స్పీకర్
— ఆధారాల సమర్పణకు 3 రోజుల గడువు ఇచ్చిన స్పీకర్
— ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ మొదలుపెట్టనున్న స్పీకర్
— ఆరుగురు ఎమ్మెల్యేలు సంజయ్, పోచారం, కాలె యాదయ్య..
— తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్‌రెడ్డికి నోటీసులు
— ఇప్పటికే ఈ కేసులో MLAలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. MLAలపై ఫిర్యాదుచేసిన BRS నేతలకు వాటిని పంపించారు. అయితే MLAల వివరణపై సంతృప్తి చెందని స్పీకర్, మరిన్ని ఆధారాలు కోరారు.
న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సులో రేవంత్ పాల్గొన్నారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. నగర శివార్లలో నెట్ జీరో సిటీ అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలో డ్రగ్స్ నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారాయన. పారిశ్రామిక వేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ కోరారు.
మెడికల్ కాలేజీల విషయంలో ఏపీలో వైసీపీ నిరసన వ్యక్తం చేస్తోంది. గుంటూరులో జరిగిన వైసీపీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు బేరసారం చేస్తున్నారని విమర్శించారు.
వైసీపీ చలో మెడికల్ కాలేజీల పిలుపుతో రాజమండ్రిలో ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ పిలుపు మేరకు రాజమండ్రి మెడికల్ కాలేజీకి వెళ్లేందుకు ప్రయత్నించారు వైసీపీ శ్రేణులు. మెడికల్ కాలేజీ దగ్గరకు వెళ్లడానికి వీల్లేదంటూ మాజీ ఎంపీ మార్గాని భరత్‌ను అడ్డుకున్నారు పోలీసులు. కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయంటూ మార్గాని భరత్‌కు నోటీసులు ఇచ్చారు.
ఏపీలో మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తీసుకున్న పీపీపీ విధానాన్ని నిరసిస్తూ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు ప్లకార్లు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు వైసీపీ శ్రేణులు. సత్తెనపల్లిలో వైసీపీ శ్రేణులు ధర్నా చేశాయి. తాలుకా సెంటర్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరు నుంచి పిడిగురాళ్ళ మెడికల్ కాలేజ్ పరిశీలనకు వెళ్లున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి పీపీపీ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి మేఘాల విస్ఫోటనం సంభవించింది. కిన్నౌర్‌లోని నిచార్‌లో సంభవించిన మేఘాల విస్ఫోటనం విధ్వంసం సృష్టించింది. వరదల ధాటికి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించింది. ప్రమాదాన్ని గ్రహించిన గ్రామస్తులు తమ ఇళ్లను వదిలి సమీపంలోని అడవిలోకి పారిపోయి అక్కడ ఆశ్రయం పొందారు.
2025 లో చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21 న ఏర్పడనుంది. ఇది చాలా ముఖ్యమైన ఖగోళ, జ్యోతిషశాస్త్ర సంఘటన. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ గ్రహణం కన్య రాశి .. ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సంభవిస్తుంది. ఇది అన్ని రాశులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ గ్రహణం వల్ల చెడు ప్రభావానికి లోనయ్యే కొన్ని రాశులు ఉన్నాయి. ఈ గ్రహణం వారి జీవితాల్లో పెను మార్పులు, సవాళ్లను తీసుకురావచ్చు.
అనిల్ అంబానీ కేసులో చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. అనిల్ అంబానీ కంపెనీలకు, యెస్ బ్యాంకుకు మధ్య.. లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ పేర్కొంది. 2017లో RCFLలో రూ.2047 కోట్లను..RHFLలో రూ.2965 కోట్లను పెట్టుబడి పెట్టింది యెస్ బ్యాంక్. కేర్ రేటింగ్స్ హెచ్చరించినా యెస్ బ్యాంక్ నాటి అధినేత రాణా కపూర్ ఆమోదంతోనే పెట్టుబడులు పెట్టారని సీబీఐ తెలిపింది. ప్రజాధనాన్ని వివిధ దశల్లో పక్కా ప్రణాళికతో పక్కదారి పట్టించారని సీబీఐ తెలిపింది.
అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం బాధగానే ఉందన్నారు ఏపీ TDP అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అనడం తప్పని.. జగన్ ప్రజా తీర్పును గౌరవించి అసెంబ్లీకి హాజరు కావాలన్నారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోతే తామే ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు.
ఏసీ శాసనసభలో గందరగోళం నెలకొంది. మెడికల్ కాలేజీలపై చర్చ చేపట్టాలని వైసీపీ నినాదాలు చేసింది. దీంతో 10 నిమిషాల పాటు సభ వాయిదా పడింది.
అమెరికా శాంటాక్లారాలో మహబూబ్‌నగర్ వాసి మహమ్మద్ నిజాముద్దీన్ మృతి చెందాడు. పోలీస్ కాల్పుల్లో మృతి చెందాడు. రూమ్‌మేట్‌పై కత్తితో దాడి చేస్తుండగా ఆపేందుకు కాల్పులు జరుపగా మృతి చెందాడు. ఏసీ విషయంలో రూమ్‌మేట్‌తో నిజాముద్దీన్ గొడవ దిగగా, పక్కింటివాళ్లు ఇచ్చిన సమాచారంతో స్పాట్‌కి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు హెచ్చరించినా నిజాముద్దీన్ గొడవ ఆపలేదని, దీంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలుస్తోంది. 2016లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు నిజాముద్దీన్.
ఢిల్లీ పర్యటనలో ఈరోజంతా బిజీబిజీగా గడపనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో కీలక భేటీలు కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు సీఎం. ఉదయం 11గంటలకు న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీతో రేవంత్ సమావేశంకానున్నారు. అలాగే మధ్యాహ్నం 12గంటలకు అమెజాన్, కార్ల్స్‌బర్గ్, కార్ల్స్‌బర్గ్, కార్లైల్, గోద్రేజ్, ఉబర్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 12:30కి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. తాజ్‌ప్యాలెస్ హోటల్‌లో జరిగే పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 12వ వార్షికోత్సవంలో ప్రసంగించనున్నారు సీఎం రేవంత్. విజన్ తెలంగాణ రైజింగ్ చర్చలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడతారు. 2047కి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను మార్చడమే లక్ష్యమంటోన్న రేవంత్‌రెడ్డి.. ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించడానికి చర్చలు జరపనున్నారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం అయ్యిందంటే చాలు కుండపోత వర్షం బీభత్సం సృష్టిస్తోంది. నగరంలో కురుస్తున్న కుండపోత వానకు గత వారం రోజుల్లో నలుగురు చనిపోయారు. భారీ వర్షానికి రహదారులు కాలువలుగా మారుతున్నాయి. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే నాలాల్లో పడి ముగ్గురు కొట్టుకుపోగా.. బుధవారం రాత్రి వరదలో చిక్కుకొని బల్కంపేట ప్రాంతంలో యువకుడు మృతి చెందాడు.
గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్న సాయంత్రం గంటపాటు ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. దీంతో బహుదూర్‌పురా ప్రాంతంలో అత్యధికంగా 9.1 సెం.మీ, నాంపల్లిలో 8 సెం.మీ, చార్మినార్‌లో 7.8, కాప్రాలో 6.2 సెం.మీ, ఖైరతాబాద్‌లో 5.6 సెం.మీ వర్షపాతం కురిసింది.
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్రం మట్టం నుండి 3.1 కి.మీ ఎత్తులో ఏర్పడిన ద్రోణి ఏర్పడింది. ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40కి.మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
భారత్‌లో ఐఫోన్-17 విక్రయాలు ప్రారంభం అయ్యాయి. ముంబై, ఢిల్లీల్లో కొత్త ఫోన్ల కోసం భారీ క్యూలైన్లు ఉంది. ఐ ఫోన్-17 కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు కస్టమర్లు. ఐఫోన్ అమ్మకాలు ప్రారంభం కావడంతో గ్యాడ్జెట్ ప్రియుల పట్టరాని సంతోషంలో ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ రాజయ్య అనే వ్యక్తి అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. మానేరు వాగు నీటిలో చాకలి రాజయ్య మృతదేహం లభించడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించి భద్రత కట్టుదిట్టం చేశారు.
గుంటూరులో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఓకార్యక్రమంలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడిపోతే తన వెనకాలే ఇంటెలిజెన్స్ వస్తోందన్నారు. తాను ఎవరిని కలుస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటున్నారని చెప్పారు. అయితే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. కాంగ్రెస్‌లోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు రాజగోపాల్‌రెడ్డి. అనవసరంగా తనపై రూమర్స్ సృష్టిస్తున్నారని అన్నారు రాజగోపాల్‌రెడ్డి.
— రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైన తీవ్రత
— భూమికి 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం
— రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చట్కాలో భూప్రకంపనలు
— తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ
— ప్రస్తుతానికి ఎలాంటి నష్టం జరగలేదని గవర్నర్ వెల్లడి
— భూకంప తీవ్రతకు ఇళ్లలోని ఫర్నిచర్, ఇతర వస్తువులు తీవ్రంగా కంపించాయి.
— వీధుల్లో ఆపి ఉంచిన కార్లు సైతం అటూ ఇటూ ఊగిపోయాయి.
Delhi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మొదటి ఛైర్‌పర్సన్ లలిత్ మోదీ సోదరుడిని గురువారం ఢిల్లీ పోలీసులు అత్యాచారం ఆరోపణలపై అరెస్టు చేశారు. విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డైరెక్ట్-సెల్లింగ్ కంపెనీ మోడీకేర్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మోదీపై సెప్టెంబర్ 10న గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా మాజీ ఉద్యోగి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో సమీర్ మోదీ 2019 నుండి పదే పదే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదుదారు ఆరోపించారు.
ఈనెల 30 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్నాయి. మెడికల్ కాలేజీలపై వాయిదా తీర్మానం ఇవ్వనుంది వైసీపీ. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి ఐదు వరకు ఒక్కోరోజు ఒక్కో సబ్జెక్ట్‌పై చర్చ జరుగనుంది.
ఇవాళ సభలో 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టనుంది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మధ్యాహ్నం బనకచర్ల, ఇరిగేషన్‌పై ప్రాజెక్టులపై చర్చ జరుగనుంది. కూటమి పార్టీల నేతలు మాట్లాడిన తర్వాత చివరిలో చర్చలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
రష్యాలో భారీ భూకంకం చోటు చేసుకుంది. భూకం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు అక్కడి అధికారులు.
ఇండోనేషియాలో భూకంపం
ఇక ఇండోనేషియాలో కూడా భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.
ఆపరేషన్ సింధూర్‌తో భారత్ చేతిలో చావుదెబ్బలు తిన్న పాకిస్తాన్ కొత్త డ్రామాలు మొదలుపెట్టింది. మైండ్‌గేమ్‌తో భారత్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్.