Telangana: వాగులో మరమ్మత్తు తవ్వకాలు.. 25 అడుగుల లోతులో బయటపడిన ఊహించని అద్భుతం

అదో పెద్ద వాగు.. మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. జేసీబీ ప్రొక్లెయిన్‌తో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఊహించని విధంగా 25 అడుగుల లోతులో ఓ అద్భుతం తారసపడింది.

Telangana: వాగులో మరమ్మత్తు తవ్వకాలు.. 25 అడుగుల లోతులో బయటపడిన ఊహించని అద్భుతం
Representative image

Updated on: Feb 28, 2022 | 6:57 PM

Mahabubnagar District: అదో పెద్ద వాగు.. మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి. జేసీబీ ప్రొక్లెయిన్‌తో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే ఊహించని విధంగా 25 అడుగుల లోతు తీసిన ప్రొక్లెయినర్ కొమ్ముకు ఏదో రాయి తగిలనట్లు గట్టిగా శబ్ధం వినిపించింది. ఆ పైన ఇసుకను కొంచెం అటూ, ఇటూ అని చూడగా అద్భుత దృశ్యం తారసపడింది. వెంటనే ప్రొక్లెయిన్ దిగి.. డ్రైవర్ పరిగెత్తి వెళ్లి చూడగా.. అది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహం. దీంతో అక్కడ ఉన్నవారు వెంటనే విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో స్థానికులు భారీగా తరలివచ్చి వెంకన్నకు పూజలు చూశారు. వివరాల్లోకి వెళ్తే.. చిన్నచింతకుంట మండలం ముచ్చింతల వద్ద ఊకచెట్టు వాగులో పనులు చేస్తుండగా… శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహం(Lord Balaji Statue) బయటపడింది. ఆదివారం సాయంత్రం వాగులో చెక్‌ డ్యాంలో పనులు జరుగుతున్న ప్రాంతంలో జేసీబీ పొక్లెయిన్‌తో ఇసుక(Sand) తవ్వుతుండగా 25 అడుగుల లోతులో శ్రీవారి విగ్రహం కనిపించింది.

మూడున్నర అడుగుల శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి రాతి విగ్రహం చూసి మొదట అక్కడున్న కూలీలు ఆశ్చర్యానికి గురయ్యారు. అధికారులు వెంటనే తవ్వకాలు ఆపేసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి విగ్రహం బయటకి తీసి పక్కనే ఉన్న ఊటబావి వద్ద శుభ్రం చేశారు. విగ్రహాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఈ విగ్రహం అతి పురాతనమైందని స్థానిక పూజారులు చెబుతున్నారు. తిరిగి గుడి కట్టి విగ్రహ ప్రతిష్టాపన చేస్తామని,  అందరం చర్చించి నిర్ణయం తీసుకుంటామని గ్రామ పెద్దలు చెప్పారు. వాగులో వెంకన్న విగ్రహం బయటపడిందన్న వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Also Read:  వాహనం ఆపగా కదులుతూ కనిపించిన గోనె సంచులు.. తనిఖీ చేసిన పోలీసులు షాక్