Chicken Price: చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి.. మొన్నటి వరకు రూ. 180, నేడు..
పవిత్ర మాసం ముగిసిన వెంటనే కోడి ధరలకు రెక్కలొస్తాయి. తాజాగా మార్కెట్లోకి ఇలాంటి పరిస్థితే నెలకొంది. మొన్నటి వరకు కార్తీక మాసం ఉన్న నేపథ్యంలో చికెన్ ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఒకానొక సందర్భంలో అయితే కిలో చికెన్ రూ. 160 నుంచి రూ. 180 వరకు పలికింది. అయితే ఏమంటూ కార్తీక మాసం ముగిసిందే ఒక్కసారిగా ధరలు పెరిగాయి. తాజాగా కార్తీక మాసం ముగిసిన తర్వాత వచ్చిన తొలి ఆదివారం...
ఆదివారం వచ్చిందంటే చాలు భోజనంలో చికెన్ ఉండాల్సిందే. వారంలో ఒక్కసారైనా ముక్క లేనిది ముద్ద దిగే పరిస్థితి ఉండదు. ఇక మటన ధరలు భారీగా ఉండడంతో చాలా మంది చికెన్ వైపే మొగ్గు చూపిస్తుంటారు. అయితే చికెన్ ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు కనిపిస్తుండడం సర్వసాధారణం. ముఖ్యంగా ఉపవాసాలు ఉండే శ్రావణమాసం, కార్తీక మాసాల్లో చికెన్ అమ్మకాలు భారీగా తగ్గుముఖం పడతాయి. దీంతో ధరలు ఒక్కసారిగా తగ్గిపోతాయి.
పవిత్ర మాసం ముగిసిన వెంటనే కోడి ధరలకు రెక్కలొస్తాయి. తాజాగా మార్కెట్లోకి ఇలాంటి పరిస్థితే నెలకొంది. మొన్నటి వరకు కార్తీక మాసం ఉన్న నేపథ్యంలో చికెన్ ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ఒకానొక సందర్భంలో అయితే కిలో చికెన్ రూ. 160 నుంచి రూ. 180 వరకు పలికింది. అయితే ఏమంటూ కార్తీక మాసం ముగిసిందే ఒక్కసారిగా ధరలు పెరిగాయి. తాజాగా కార్తీక మాసం ముగిసిన తర్వాత వచ్చిన తొలి ఆదివారం (నిన్న) చికెన్ ధరలు ఒక్కసారి జంప్ అయ్యాయి. కొన్ని చోట్ల ఆదివారం కిలో చికెన్ ఏకంగా రూ. 220 నుంచి రూ. 240కి పెరిగిపోయింది. దీంతో ఆదివారం చికెన్ తెచ్చుకుందామని దుకాణాలకు వెళ్లిన వారు అవాక్కయ్యే పరిస్థితి వచ్చింది.
ఇక ఆన్‌లైన్‌లో చికెన్ డెలివరీ సంస్థలైతే ధరలను భారీగా పెంచేశాయి. కార్తీక మాసంలో డిస్కౌంట్స్ పేరిట తక్కువ ధరకు చికెన్‌ను అందించి సంస్థలు ఇప్పుడు ఒక్కసారిగా ధరలను పెంచేశాయి. ఈ సంస్థలు కిలో చికెన్‌ను ఏకంగా రూ. 250 నుంచి రూ. 280 వరకు విక్రయిస్తుండడం గమనార్హం. కొన్ని పేరున్న సంస్థల్లో అయితే డెలివరీ ఛార్జీలతో కలిపి కిలో చికెన్ ధర రూ. 300 కూడా దాటేసింది.
ఇక బాయిలర్ చికెన్‌తోపాటు దేశీకోడి ధరలు కూడా పెరిగాయి. ఈ చికెన్‌పై కిలోకు ఏకంగా రూ. 100 నుంచి రూ. 150 పెరగగడం గమనార్హం. ఇక మటన కూడా చికెన్ దారిలోనే ప్రయణిస్తోంది. కేజీ మటన్ ప్రాంతాలను బట్టి రూ. 800 నుంచి రూ. 1000 వరకు పలుకుతోంది. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతితోపాటు పెళ్లిళ్లు కూడా ఉండడంతో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండడంతో చికెన్ ధరలు మరో రెండు నెలలపాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..