Munugode bypoll: చండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. రేవంత్‌రెడ్డి ఆగ్రహం..

|

Oct 11, 2022 | 12:53 PM

చండూరు కాంగ్రెస్‌ ఆఫీసులో ప్రచార సామగ్రి దగ్ధమైంది. సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఐదు లక్షల విలువైన ప్రచార సామగ్రి కాలిపోయిందని కాంగ్రెస్‌ కార్యకర్తలు చండూరులో..

Munugode bypoll: చండూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. రేవంత్‌రెడ్డి ఆగ్రహం..
Congress Party Office
Follow us on

మునుగోడులో నామినేషన్ల సందడి ఒకవైపు నడుస్తుంటే..మరోవైపు ప్రచార సామగ్రి తగలబడిపోవడం కలకలం రేపుతోంది. చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే అక్కడ కాంగ్రెస్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఎన్నిక ప్రచారం కోసం సిద్ధం చేసిన జెండాలు, పోస్టర్లు తగలబడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. ఐదు లక్షల విలువైన ప్రచార సామగ్రి కాలిపోయిందని కాంగ్రెస్‌ కార్యకర్తలు చండూరులో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఆఫీసును తగులబెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు ధర్నాకు దిగారు. మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో పాటు మాజీ ఎమ్మెల్యేలు విజయరమణా రావు, ఇతర నేతలు ధర్నా చేపట్టారు.

చండూరులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పర్యటనకు ముందు ఇలా జరగడం గమనార్హం. ఈ ఘటనపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి దుష్ట చర్యలకు దిగుతున్నారని అన్నారు. పార్టీ ఆఫీస్‌పై దాడి చేసి దిమ్మెలు కూల్చినా.. మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్‌ జెండానే అని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు.

మా కేడర్‌ను బెదిరించాలని టీఆర్‌ఎస్‌, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని మండి పడ్డారు. ఘటనకు బాధ్యులైన వాళ్లపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే.. ఎస్పీ ఆఫీస్‌ ముందు తానేస్వయంగా ధర్నాలో పాల్గొంటానని రేవంత్‌ రెడ్డి పోలీస్‌ శాఖకు అల్టిమేటం జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం