
వయస్సు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని.. దిల్‌లో ధైర్యం ఉంటే మనల్ని ఎవడూ ఆపలేరు అని ప్రూఫ్ చేస్తున్నాడు ఓ వృద్ధుడు. తాజాగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువగా యువకులు పోటీ చేస్తున్నారు. యువకులు రాజకీయాల్లోకి రావాలి అని చాలా మంది చెబుతున్నారు కూడా. కానీ 77 ఏళ్ల వ్యక్తి మాత్రం.. తాను యువతతో పాటు పోటీపడతా అంటూ సర్పంచ్ ఎన్నికల బరిలో నిల్చున్నాడు. ఈ వయస్సులో నీకు పోటీ ఎందుకు అని చాలామంది అన్నప్పటికీ ఆయన మాత్రం అసలు తగ్గడం లేదు. తెలంగాణలోని అన్ని గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఎక్కువ యువత రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్న సమయంలో.. తనకు వయసుతో సంబంధం లేదని, యువకుల కంటే ఎక్కువ ఉత్సాహంగా నేను పనిచేస్తానని అంటున్నాడు 77 ఏళ్ల దేవులపల్లి చంద్రయ్య.సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రం సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్‌కి రిజర్వ్ అయింది. మండల కేంద్రంలో 9 మంది సర్పంచుల అభ్యర్థులు బరిలోకి దిగగా.. అందులో ఒకరు ఈ 77 ఏళ్ల దేవులపల్లి చంద్రయ్య ఒకరు.
చంద్రయ్య భార్య ఎల్లవ్వ 11 సంవత్సరాల క్రితమే చనిపోయింది. ఉన్న ముగ్గురు కొడుకులు హైదరాబాదులో పనిచేస్తుండ..గా చంద్రయ్య ఒక్కడు ఊర్లో ఉంటూ వ్యవసాయ పనులు చూసుకుంటూన్నాడు..ఈ వయసులో కూడా చాలా చక్కగా, తన పని తాను చేసుకుంటూ ఉత్సాహంగా ఉన్నానని.. తనకు రాజకీయాలంటే ఇష్టమని.. అందుకే ఎన్నికల బరిలోకి దిగనట్లు చెబుతున్నాడు. తనకు అవకాశం ఇస్తే గ్రామంలో ఎంతో సేవ చేస్తానని, గ్రామ అభివృద్ధితో పాటు రాజకీయాలంటే ఏంటో ఇప్పటి యువతకు చూపిస్తానని అంటున్నాడు. ప్రస్తుతం లంచం లేకుండా ఇప్పుడు ఎవరూ పనిచేయడం లేదని.. తాను మాత్రం నిస్వార్ధంగా పనిచేస్తాను అని అంటున్నాడు.. అందుకే సర్పంచ్‌గా తనను గెలిపిస్తే ఈ జీవితంలోని చివరి దశను ప్రజలకు అంకితం చేస్తానని అంటున్నాడు ఈ 77 ఏళ్ల చంద్రయ్య.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.